Amaravati, july 24: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 48,114 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,380 మంది కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా 49 మంది మృతిచెందారు. తూర్పుగోదావరిలో 11 మంది, కృష్ణాలో 9 మంది, కర్నూలులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు కరోనాతో చనిపోయారు. కరోనా చికిత్సకు వచ్చే 6 నెలల్లో రూ.1000 కోట్లు ఖర్చు, మరణాలు తగ్గించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఏపీ సీఎం ఆదేశాలు, ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఏపీ సీఎం ఫోకస్
కొత్తగా వైరస్ బాధితుల్లో 44 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 933 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,41,993 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది.తాజా పరీక్షల్లో 25,125 పరీక్షలు ట్రూనాట్ పద్ధతిలో, 22,989 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. ఇప్పటి వరకు 39,935 మంది డిశ్చార్జ్ కాగా 39,990 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
Here'a AP Coronavirus Updates
#COVIDUpdates: 24/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 77,963 పాజిటివ్ కేసు లకు గాను
*37,198 మంది డిశ్చార్జ్ కాగా
*933 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 39,832#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/cFz8XSGhKf
— ArogyaAndhra (@ArogyaAndhra) July 24, 2020
#COVIDUpdates: #COVID19 cases in the last 24 hours as on 24/07/2020 till 10 AM #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/7bokQ6hMl9
— ArogyaAndhra (@ArogyaAndhra) July 24, 2020
ఇక జిల్లాల వారీగా ఇప్పటిదాకా నమోదైన కేసులను పరిశీలిస్తే... తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, గుంటూరులో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం ఈ మూడు జిల్లాల్లోనే గురువారం రోజున 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 11వేలకుపైగా కరోనా బాధితులున్నారు. ఏపీలో కరోనా వృద్ధిరేటు 9.7 శాతం ఉండగాజజ భారత కరోనా వృద్ధిరేటు 3.62 శాతం ఉంంది.