Coronavirus Outbreak. | (Photo-PTI)

New Delhi, July 24: దేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 49,310 మంది క‌రోనా పాజిటివ్‌లుగా (Coronavirus in India) నమోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 30,601 మంది (Coronavirus Deaths) చ‌నిపోయారు. నిన్న ఒకేరోజు కొత్త‌గా 720 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో రోజువారి క‌రోనా కేసుల్లో బ్రెజిల్‌ను (Brezil) వెన‌క్కి నెట్టిన భార‌త్‌ (India), అమెరికా (America) త‌ర్వాత రెండోస్థానంలో నిలిచింది. భారత్‌లో 18 కోట్ల మందికి కరోనా భయమే లేదు, వారి శరీరం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, థైరోకేర్‌ సర్వేలో వెల్లడి

దేశంలో వారం రోజుల్లోనే (జూలై 16 నుంచి 22 వ‌ర‌కు) 2,69,969 పాజిటివ్ కేసులు (Coronavirus Cases) న‌మోద‌య్యాయి. నిన్న రికార్డు స్థాయిలో 45,720 క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో 76 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 3,52,801 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అదేవిధంగా జూలై 23 వ‌ర‌కు దేశంలో 1,54,28,170 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది.

కరోనా మృతదేహాల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని చాలామంది మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించడం లేదు. ఎక్కడో దూరంగా విసిరేసి వస్తున్నారు. అయితే బతికున్నవాళ్ల దగ్గర్నుంచి వైరస్‌ సోకే అవకాశంతో పోలిస్తే మృతదేహాల ద్వారా సోకే అవకాశం 100 రెట్లు తక్కువని డాక్టర్లు చెబుతున్నారు. మృతదేహాల్లో వైరస్‌ గరిష్ఠంగా మూడు-నాలుగు గంటలకు మించి బతకలేదని వారు అంటున్నారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు చిమ్మే తుంపరల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనిషి మరణించినప్పుడు ఆ లక్షణాలు ఉండవు కనుక వైరస్ వ్యాప్తి జరగదని చెబుతున్నారు. తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కల్లోలం, 84 మంది సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్, తమిళనాడులో లక్షా 90 వేలకు చేరువలో కరోనా కేసులు

కాగా కరోనాతో ఎవరైనా చనిపోతే సమయం గడిచే కొద్దీ మృతదేహంలో వైరస్‌ మనుగడ సాగించే శక్తిని క్రమంగా కోల్పోతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా మృతదేహాలకు పరీక్షలు, రవాణా, అంత్యక్రియలకు సంబంధించి ఐసీఎంఆర్‌ ఇచ్చిన మార్గదర్శకాల్లో ప్రస్తావించిన దాని ప్రకారం.. శవపరీక్ష చేసేటప్పుడు మృతదేహాల ఊపిరితిత్తుల ద్వారా వైద్యులకు, సిబ్బందికి సోకే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం నడుచుకోకపోతేనే ఉంటుంది. అందుకే కొవిడ్‌ పేషెంట్లకు నాన్‌ ఇన్వేజివ్‌ పద్ధతిలో అటాప్సీ చేయాలని ఐసీఎంఆర్‌ సూచించింది.