Tamil Nadu Shocker: దారుణం, తాగుడుకు భార్య డబ్బులు ఇవ్వలేదని ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేసిన తండ్రి, ఏడేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు

తన భర్త తాగి వచ్చి తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారని భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.

Rape (Photo-IANS)

Chennai, July 19: తమిళనాడులో కూతుళ్లపై అత్యాచారం చేసిన వ్యక్తికి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. తన భర్త తాగి వచ్చి తన ఇద్దరు మైనర్ కూతుళ్లపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డారని భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.

TOI  కథనం ప్రకారం అలాగే భార్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తన భర్త తాగి వచ్చి రోజూ రాత్రి పూట 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తమ కుమార్తెలను పదేపదే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు తనపై దాడికి పాల్పడ్డాడని బాలికల తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.  దారుణం, ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై స్నేహితుడు అత్యాచారం, చెట్టుకు కట్టేసి మరీ అఘాయిత్యం

తాగుబోతు భర్త.. మహిళ వద్ద నుంచి మరిన్ని డబ్బు, నగలు కావాలని కోరగా, ఆమె నిరాకరించడంతో కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా, కిల్‌పాక్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఇతర సెక్షన్‌లతో పాటు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేశారు. జూలై 2021లో, ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.రూ. 55,000 జరిమానాతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఎం. రాజలక్ష్మి తీర్పు చెప్పారు.అదనంగా, ప్రాణాలతో బయటపడిన ఇద్దరి కూతుళ్లకు రూ. 3,00,000 పరిహారం చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif