Tea Diplomacy: సస్పెండ్ ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ చైర్మన్, మా పోరాటం టీ కోసం కాదు..రైతుల కోసమన్న విపక్షాలు, రాత్రంతా మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో సస్పెన్షన్‌ ఎంపీలు

అయితే వాటిని తాము తిరస్కరించామని ఆయన వెల్లడించారు. ఇవాళ ఉదయం డిప్యూటీ చైర్మన్ మమ్మల్ని కలుసేందుకు ధర్నా స్థలి వద్దకు వచ్చారు. అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాన్ని ఆమోదించారనీ... బీజేపీ మైనారిటీలో ఉండగా ఎలాంటి ఓటింగ్ లేకుండా రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించారని మేము చెప్పాం. అలా ఎలా ఆమోదిస్తారని.. అందుకు మీరే కారణమని కూడా ఆయనకు స్పష్టం చేశాం..’’ అని సంజయ్ వెల్లడించారు.

PM Narendra Modi Lauds Rajya Sabha Deputy Chairman Harivansh (Photo Credits: ANI & PTI)

New Delhi, September 22: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే ఉభయసభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లులు రైతులకు తూట్లు పొడిచే విధంగా ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. స్పీకర్ దగ్గరకు వెళ్లి మరీ నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను చించివేశారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ వెంకయ్యనాయుడు ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలపై వారం రోజుల పాటు సస్పెన్సన్ వేటు వేశారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు..సస్పెన్షన్‌కి గురైన ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు నిన్న పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ధర్నా చేపట్టారు. ఇది రెండో రోజూకి చేరింది. రాత్రంతా ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలోని పచ్చికలోనే గడిపారు.

ఆమాద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తమ ధర్నా తాలూకు ఫోటోలు, వీడియోలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తమకు టీ, స్నాక్స్ (Tea Diplomacy) తీసుకుని వచ్చారనీ.. అయితే వాటిని తాము తిరస్కరించామని ఆయన వెల్లడించారు. ఇవాళ ఉదయం డిప్యూటీ చైర్మన్ మమ్మల్ని కలుసేందుకు ధర్నా స్థలి వద్దకు వచ్చారు.

కొత్త చట్టంతో ప్రతిపక్షాల ఓటు బ్యాంకు పోతుంది, ఆ భయంతోనే విమర్శలు చేస్తున్నారు, బీహార్‌లో ప‌లు ప్రాజెక్టుల శంకుస్థాప‌న సంద‌ర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు

అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాన్ని ఆమోదించారనీ... బీజేపీ మైనారిటీలో ఉండగా ఎలాంటి ఓటింగ్ లేకుండా రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించారని మేము చెప్పాం. అలా ఎలా ఆమోదిస్తారని.. అందుకు మీరే కారణమని కూడా ఆయనకు స్పష్టం చేశాం..’’ అని సంజయ్ వెల్లడించారు.

Here's Sanjay Singh AAP tweets

తమకు టీ తీసుకు రావడం (Deputy Chairman Harivansh For Serving Chai to Suspended MPs) మంచి సంకేతమే అయినా... ఈ సమయంలో ఆయన చేసింది మాత్రం తప్పేనని డిప్యూటీ చైర్మన్‌కు మరో సీనియర్ ఎంపీ చెప్పినట్టు సంజయ్ (Sanjay Singh) తెలిపారు. ‘‘ఉదయాన్నే డిప్యూటీ చైర్మన్ కొందరు మీడియా ప్రతినిధులు, కెమేరాలతో ధర్నా స్థలి వద్దకు వచ్చారు. అయితే కెమేరాలు లేకుండా వచ్చి కూర్చోవాలనీ.. అప్పుడే ఆయనతో మాట్లాడతామని సీనియర్ ఎంపీ ఒకరు స్పష్టం చేశారు..’’ అని ఆయన పేర్కొన్నారు.

రాజ్యసభలో దుమారం, 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై విపక్షాల అవిశ్మాస తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు

కాగా ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసింది మొదలు అందరి కళ్లూ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్ సింగ్‌పైకి మళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం వివాదాస్పద వ్యవసాయ బిల్లులను ఆమోదిస్తున్న సందర్భంగా డిప్యూటీ చైర్మన్ పట్ల ‘‘అనుచితంగా’’ ప్రవర్తించారంటూ ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Here's PM Modi and  Sanjay Singh AAP Tweets

టీ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. కొద్ది రోజుల క్రితం తనపై దాడి చేసి, అవమానించిన వారికి..ధర్నాలో కూర్చున్న వారికి వ్యక్తిగతంగా టీ అందిచడం ద్వారా శ్రీ హరివంష్ జీ వినయపూర్వకమైన మనస్సుతో, పెద్ద హృదయంతో ఆశీర్వదించబడ్డారని తెలుస్తుంది. ఇది అతని గొప్పతనాన్ని చూపిస్తుంది. హరివంశ్ జిని అభినందించడానికి నేను భారత ప్రజలతో చేరాను అని ప్రధాని ట్వీట్ చేశారు.

విపక్షాల నిరసనల మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

దీనికి సస్పెండ్ అయిన ఎంపీ సంజయ్ సింగ్ ఇచ్చారు. మిస్టర్ మోడీ, మేము మా టీ కోసం పోరాటం చేయడం లేదు. మీరు తీసుకెళ్లిన మా రైతుల సంక్షేమం కోసం మేము పోరాడుతున్నాం. నేను వినయంగా నిన్ను అభ్యర్థిస్తున్నాను - నేను మీ టీని అన్ని గౌరవాలతో తిరిగి ఇస్తున్నాను, దయచేసి నా రైతులకు కొంచెం పుడ్ తిరిగి ఇవ్వండి. అని ట్వీట్ చేశారు.



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

India Canada Dispute: ఇండియా ఆగ్రహంతో దిగి వచ్చిన కెనడా, ఆ తీవ్రవాది హత్య వెనుక మోదీ, అమిత్ షా హస్తం లేదని ప్రకటన, మీడియా కథనాలను కొట్టివేసిన ట్రూడో ప్రభుత్వం

PM Modi At Guyana Parliament: ఇది యుద్ధాల శ‌కం కాదు! గ‌యానా పార్ల‌మెంట్ లో ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌ల‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పంద‌న‌

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం