Teacher Assaulted In WB: మహిళా టీచర్‌పై క్రూరమైన దాడి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ వెళ్లిన టీఎంసీ నేత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
దారుణంగా హింసించారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ హేయమైన ఘటన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తెలియడం లేదు. తమ భూమిలో రోడ్డు నిర్మాణం ఏంటని అడిగిన పాపానికి టీచర్ తో పాటు ఆమె చెల్లిని నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన (Teacher Assaulted In WB) ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. టీఎంసీ (TMC) నేతల అరాచకాలను కళ్లముందుకు తీసుకొస్తోంది.
Kolkata, February 3: మహిళా టీచర్ అని కూడా చూడలేదు. దారుణంగా హింసించారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ హేయమైన ఘటన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తెలియడం లేదు. తమ భూమిలో రోడ్డు నిర్మాణం ఏంటని అడిగిన పాపానికి టీచర్ తో పాటు ఆమె చెల్లిని నడిరోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన (Teacher Assaulted In WB) ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. టీఎంసీ (TMC) నేతల అరాచకాలను కళ్లముందుకు తీసుకొస్తోంది. పూర్తి వివరాల్లోకెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్మృతి ఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా (Teacher) పని చేస్తోంది. తన తల్లి, సోదరితో కలిసి ఫటా నగర్‌లో (Fata Nagar village) నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరికి చెందిన భూమిలో కొంత భాగాన్ని అప్పగించారు. రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్‌ను చితకబాదిన తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు
అయితే గ్రామ పంచాయతీ (Gram Panchayat) మరోసారి రోడ్డు వెడల్పు చేయాలని భావించగా వారు దీనికి ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమిలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోతామని మాకు ఏదైనా పరిహారం ఇప్పించిన తర్వాత పనులు చేయాలని కోరారు.
Here's ANI Tweet
అయితే ఇదేమి పట్టని పంచాయతీ పెద్దలు జేసీబీతో సహా ఇంటికి చేరుకొని రోడ్డు నిర్మాణం తలపెట్టారు. దీన్ని అడ్డుకుని నిరసన తెలిపిన ఇద్దరు యువతులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి (Trinamool Congress (TMC) చెందిన పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్, తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు.
అతని అనుచరులు యువతుల కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టుకుంటూ విచక్షణారహితంగా నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. దాడిని అడ్డుకున్న సోదరిని సైతం కిందపడేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు.
బెంగాల్‌లో తీవ్రవాదులుగా మారుతున్న మైనారిటీలు
ఈ ఘటనపై బాధితురాలు స్మృతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు దాడికి కారణమైన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడు అమల్ సర్కార్‌ను పార్టీ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
అమిత్ షా కొత్త స్కెచ్, మమతను ఢీకొట్టేందుకు బెంగాలీ భాషతో కుస్తీ
ఈ ఘటనపై స్మృతి మీడియాతో మాట్లాడుతూ.. ‘దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే కింద పడ్డానో ఆ క్షణం వాళ్లు నా కాళ్లు లాగి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ పోయారు. వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టమే కాకుండా ఐరన్ రాడుతో తలపై బాదేందుకు ప్రయత్నించారు. ఏకంగా చంపుతామని బెదిరించారు’ అని కన్నీళ్ల పర్యంతం అయింది.
న్యా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, కేంద్రంపై దీదీ సంచలన ఆరోపణలు
ఈ దాడిని బీజేపీ నాయకుడు, బలుర్ఘాట్ ఎంపీ సుకాంత మజుందార్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. పంచాయతీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.