Kolkata, November 3: కేంద్రంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని, గుర్తు తెలియని వ్యక్తుల నుండి తనకు వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఆరోపించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని స్వయంగా తానే ప్రధాని నరేంద్ర మోడీని కోరుతానని చెప్పారు. కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ..’ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఈ అంశంలో చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నాను.
ఇలా ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతుంటే మాట్లాడే స్వేచ్ఛ ఎలా ఉంటుంది. ఫోన్లో కూడా మనం స్వేచ్ఛగా మాట్లాడలేకపోతే ఇక మనకు ఏం స్వతంత్రం వచ్చినట్లు? కేంద్రం ఇప్పటికే నా ఫోన్‌ను ఎన్నోసార్లు ట్యాప్ చేయించింది. దీనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కేంద్రంతోపాటు మరో రెండు, మూడు రాష్ట్రాలు కూడా కలిసే ఈ పని చేశాయి. ఆ రాష్ట్రాల పేర్లును తాను బయట పెట్టనని ఆమె చెప్పారు. కానీ, వాటిలో ఒక రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది’ అని ఆరోపించారు.
మమతా బెనర్జీ ఫోన్ ట్యాపింగ్
My phone tapped: alleges Mamata Banerjee, asks PM Modi to take care of issue
Read @ANI Story | https://t.co/cfhYEe501b pic.twitter.com/d1HIUiIcR2
— ANI Digital (@ani_digital) November 2, 2019
ఇదిలా ఉంటే కొందరు లాయర్లు , జర్నలిస్టుల, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియా ద్వారా చోరీకి గురైందని వాట్సప్ సంస్థ అధికారులు ఈ మధ్య అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రధాని మోదీని కోరతామని, రెండు మూడు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ట్యాపింగ్ జరిగిందన్నారు. అలాగే చాలా మంది ప్రముఖుల వ్యక్తిగత సమాచారం చోరికి గురవుతోందని ఆమె ఆరోపించారు. పౌరుల వ్యక్తిగతల స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని చాలా సార్లు చెప్పానని మమతా బెనర్జీ తెలిపారు.