Mamata strikes with ‘minority extremism’ warning, Owaisi's sharp counter (Photo-ANI)

Kolkata,November 20: పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్ర‌వాదం పుట్టుకువ‌స్తోంద‌న్నారు.

బీజేపీ నుంచి ఓ మైనార్టీ రాజ‌కీయ పార్టీ డ‌బ్బులు తీసుకుంటున్న‌ద‌ని, అది హైదారాబాద్‌కు చెందిన‌ద‌ని, బెంగాల్ పార్టీ కాద‌ని మ‌మ‌తా అన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా నడుస్తోన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టింస్తోందని, ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.

ఏఐఎంఐఎం పార్టీని అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు. అలాగే, హిందూ అతివాద శక్తుల పట్ల కూడా ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా 2011 నుంచి పశ్చిమ బెంగాల్‌ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నా విషయం తెలిసిందే.

మమతా వ్యాఖ్యలు

2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బిజెపి ప్రయత్నాలు జరుపుతుండడంతో టీఎంసీ కూడా ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

దీనిపై ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. త‌న‌పై దీదీ విమ‌ర్శ‌లు చేయ‌డ‌మంటే.. బెంగాల్‌లో ఎంఐఎం పార్టీ త‌న ద‌ళాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లే అని ఓవైసీ అన్నారు. అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ త‌న భ‌యాన్ని, ఆందోళ‌న‌ల‌ను వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఓవైసీ తెలిపారు. ఎంఐఎం పార్టీ ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది.

అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్

బీహార్‌లోని కిష‌న్‌గంజ్ అసెంబ్లీ సీటును ఆ పార్టీ గెలుచుకున్న విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌కాశ్ అంబేద్క‌ర్ పార్టీతో పొత్తు పెట్టుకున్న‌ది. హైద‌రాబాద్‌కు చెందిన కొంద‌రి గురించి బెంగాల్ దీదీ భ‌య‌ప‌డితే.. మ‌రి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 18 సీట్ల‌ను ఎలా గెలిచింద‌ని ఓవైసీ ప్ర‌శ్నించారు.

2021లో పశ్చిమ బెంగాల్‌కు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే మమతా బెనర్జీ తనపై ఉన్న వ్యతిరేకతను రూపుమాపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కమ్యూనిస్టులకు పట్టు ఉన్న బెంగాల్ రాష్ట్రం కాలక్రమంలో కమ్యూనిస్టులు కనుమరుగై పోతుండగా దీదీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇప్పుడు ఆరాష్ట్రంలో బీజేపీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.