Shigella Infection: ఇవేం కొత్త రోగాలు..కేరళను వణికిస్తున్న షిగెల్లా వ్యాధి, బాలుడు మృతి..పెరుగుతున్న కేసుల సంఖ్య, షిగెల్లా లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

తాజాగా తొలి కరోనావైరస్ కేసు నమోదైన కేరళలో మళ్లీ కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. షిగెల్లా బ్యాక్టీరియా వ్యాధి (Shigella Infection) కేరళలొ తాజాగా బయటపడింది. ఉత్తర కేరళలోని కోజికోడ్ జిల్లాలో షిగెలోసిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మాయనాడ్ ప్రాంతంలో 11 ఏండ్ల బాలుడు మరణించగా ఈ వ్యాధి లక్షణాలతో మరింత మంది ఆస్పత్రిలో చేరారు.

Bacteria | Image used for representational purpose (Photo Credits: Pixabay)

Kozhikode, December 20: కరోనా మంటలు ఇంకా చల్లారకముందే కొత్త కొత్త వ్యాధులు దేశంలో అలజడిని రేపుతున్నాయి. తాజాగా తొలి కరోనావైరస్ కేసు నమోదైన కేరళలో మళ్లీ కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. షిగెల్లా బ్యాక్టీరియా వ్యాధి (Shigella Infection) కేరళలొ తాజాగా బయటపడింది. ఉత్తర కేరళలోని కోజికోడ్ జిల్లాలో షిగెలోసిస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మాయనాడ్ ప్రాంతంలో 11 ఏండ్ల బాలుడు మరణించగా ఈ వ్యాధి లక్షణాలతో మరింత మంది ఆస్పత్రిలో చేరారు.

ఇప్పటి వరకు ఆరుగురికి షిగెలోసిస్‌ (Shigella & Shegellosis) సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 26 మందికి ఈ వ్యాధి సోకినట్లుగా అనుమానాలున్నాయని పేర్కొంది. వారిలో కొందరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని వెల్లడించింది. షిగెల్లా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి గురించి భయాందోళన అవసరం లేదని తెలిపింది. ఈ వ్యాధి వ్యాప్తి మూలాలను గుర్తించేందుకు వైద్య నిఫుణులు ప్రయత్నిస్తున్నారని ఆరోగ్య మంత్రి కేకే శైలజ చెప్పారు.

కలుషిత నీటి వల్ల షిగెల్లా బ్యాక్టీరియా సోకినట్లుగా ప్రాథమిక నివేదికల ద్వారా తెలుస్తున్నదని వెల్లడించారు. వ్యాధి సోకిన వారి ఇండ్ల నుంచి సేకరించిన నీటి, ఆహార నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కాచి వడకట్టిన నీటిని తాగాలని ప్రజలకు ఆమె సూచించారు. కాగా షిగెల్లా బ్యాక్టీరియా వల్ల షిగెలోసిస్ వ్యాధి (Infectious Disease Shigellosis) కలుగుతుందని వైద్యులు తెలిపారు. జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, రక్త విరోచనాలు వంటి లక్షణాలుంటాయని చెప్పారు.

దేశంలో కరోనా కన్నా ప్రమాదకరమైన వ్యాధి బయటకు, ముకోర్మైకోసిస్ వ్యాధితో 9 మంది మృతి, 44 మంది ఆస్పత్రిలో.. అహ్మదాబాద్‌ని వణికిస్తున్న మ్యూకర్‌మైకోసిస్‌ ఫంగస్

బ్యాక్టీరియా సోకిన వారిలో తొలుత తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయని, వారం రోజుల తర్వాత తీవ్ర లక్షణాలుంటాయని వెల్లడించారు. పదేండ్లలోపు పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని, యాంటీ బ్యాక్టీరియా మందుల ద్వారా వ్యాధి నయమవుతుందని తెలిపారు. కలుషిత నీరు, ఆహారం, ఒకే మరుగుదొడ్డిని ఎక్కువ మంది వినియోగించడం వల్ల షిగెలోసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వైద్యులు వివరించారు. కొందరిలో లక్షణాలు కనిపించకపోయినా ఇతరులకు వ్యాప్తి చేసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

కరోనా మళ్లీ కొత్త రూపం దాల్చింది, లాక్‌డౌన్-4 దిశగా ప్రపంచ దేశాలు, మళ్లీ రాకపోకలపై నిషేధం, బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటిపోయిందని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హాంకాక్

షిగెల్లాగా వ్యాధి (Shigella – Shigellosis) లక్షణాల విషయానికొస్తే..జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట. కలుషిత నీరు, పాడైపోయిన ఆహారం తీసుకోవడం ఈ వ్యాధి వ్యాప్తికి కారణమని వైద్యులు చెబుతున్నారు. షిగెల్లా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తి వ్యాధి చాలా సులభంగా సోకే అవకాశాలున్నాయి. వైరస్ శరీరంలోకి వెళ్లిన తర్వాత 2 నుంచి 7 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.

వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవాళ్లకు గడ్డం రావచ్చు, అందరూ మొసళ్లుగా మారుతారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జైర్‌ బోల్సనారో, ఫైజర్‌ టీకాపై దాడిని ఎక్కు పెట్టిన బ్రెజిల్ అధ్యక్షుడు

ఇప్పటి వరకు కరోనాతో పోరాడుతోన్న కేరళ ప్రభుత్వం (Kerala Govt) ఇప్పుడీ కొత్త వ్యాధిపై యుద్ధం ప్రకటించింది. స్థానిక బావుల్లో, నీటి కొళాయిల్లో క్లోరినేషన్ ​చేస్తున్నారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ అమెరికాలో వచ్చేసింది, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్, అతని భార్యకు తొలి వ్యాక్సిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్‌ నెతన్యాహూకు తొలి కోవిడ్ వ్యాక్సిన్

షిగోలా వైరస్ వ్యాప్తి చెందుతుంటుందని, ఈ వైరస్ సోకినపుడు డయేరియా లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. కోజికోడ్ జిల్లా మెడికల్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో 56 డయేరియా కేసులు నమోదయ్యాయని, వాటిలో ఆరు షిగోలా వైరస్ కేసులను గుర్తించామని తెలిపారు. వీరిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొందరు కోలుకోగా డిశ్చార్జ్ చేశామన్నారు. మిగిలిన బాధితులలో ఎవరికీ తీవ్ర అస్వస్థత లేదన్నారు.