World Youth Skills Day 2020: ఇది కరోనా కాలం, అందరూ కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలి, ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఇది కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన సమయమని, మారుతున్న పరిస్థితులకు అలవాటు పడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది’ అని ప్రధాని (PM Narendra Modi) వ్యాఖ్యానించారు.
New Delhi, July 15: ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం (World Youth Skills Day 2020) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతను ఉద్దేశించి వీడియో ద్వారా ప్రసంగించారు. ఇది కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాల్సిన సమయమని, మారుతున్న పరిస్థితులకు అలవాటు పడాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది’ అని ప్రధాని (PM Narendra Modi) వ్యాఖ్యానించారు. 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 24 గంటల్లో రికార్డు స్థాయిలో 29,429 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు, ఇప్పటివరకు 5,92,032 మంది డిశ్చార్జ్
నేడు వేగంగా మారుతున్న ప్రపంచంలో, అనేక రంగాలలో మిలియన్ల మంది నైపుణ్యం గల వ్యక్తుల అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో నైపుణ్యం గల వారి అవసరం అధికంగా ఉందన్ననారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ‘స్కిల్ ఇండియా మిషన్’ను (Skill India Mision) ప్రారంభించిందని తెలిపారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వందలాది ప్రధాన మంత్రి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయన్నారు. ఐటీఐల సంఖ్యను పెంచామని, లక్షలాది కొత్త సీట్లను చేర్చామన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా యువతలో నైపుణ్య అభివృద్ధి జరిగిందని తెలిపారు. నాలుగైదు రోజుల క్రితం దేశంలోని కార్మికుల కోసం ‘స్కిల్ మ్యాపింగ్ పోర్టల్’ని ప్రారంభించామని మోదీ తెలిపారు. రాజస్థాన్ రాజకీయాల్లో ఊహించని మలుపు, బీజేపీలో చేరేది లేదన్న సచిన్ పైలట్, ప్రభుత్వ మనుగడపై కొనసాగుతున్న సస్పెన్స్
వ్యాపారాలు, మార్కెట్‌ల పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఎలా మనుగడ సాగించాలని నన్ను అనేక మంది తరచూ అడుగుతుంటారు. మనం జీవిస్తున్నది కరోనా కాలం (Coronavirus Pandemic) కావడంతో ఈ ప్రశ్నకు మరింత ప్రాధ్యాన్యం ఏర్పడింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సి మంత్రం ఒకటే..అదే కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవడం. నైపుణ్యమనేది మనకు మనమే ఇచ్చుకునే ఓ బహుమతి. దీని ద్వారా మనం ఓ ప్రత్యేకతను సంతరించుకుంటాం. ఇతరుల కంటే భిన్నంగా ఉంటాం’ అని ప్రధాని అన్నారు.
నైపుణ్యాలను అలవర్చుకోవడం ద్వారా స్వాలంబన సాధించడమే కాకుండా అభివృద్ధిలోనూ కొత్త పుంతలు చేరుకోవచ్చని తెలిపారు. ‘ప్రపంచ నైపుణ్యాల దినోత్సం సందర్భంగా దేశ యువతకు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ కరోనా కాలంలో..పని సంస్కృతితో పాటు ఉద్యోగాల తీరులోనూ మార్పులు వస్తున్నాయి. అయితే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా దేశ యువత కొత్త నైపుణ్యాలను అలవర్చుకుంటోంది’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
నైపుణ్యం కలిగిన వ్యక్తులను, కార్మికులను మ్యాపింగ్ చేయడంలో స్కిల్ మ్యాపింగ్ పోర్టల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు, ఈ పోర్టల్ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను ఒకే క్లిక్‌తో చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఈ సంక్షోభం ప్రపంచంలో అన్నిదేశాలలో సమానంగా ఉంటుందన్నారు. ఈ ప్రభావంతో ఉద్యోగ స్వభావం కూడా మారిందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికత కూడా ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్న, పెద్ద ప్రతి రకమైన నైపుణ్యం కూడా స్వావలంబన భారతదేశానికి చాలా పెద్ద శక్తిగా మారుతుందని మోదీ స్పష్టం చేశారు.