Congress leader Sachin Pilot (Photo Credits: PTI)

Jaipur, July 15: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం (Rajasthan Political Crisis) ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు లేవదీసిన రాజ‌స్థాన్ మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌ ఆ పార్టీకి అనుకోని ఘలక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ (Congress Party) నుంచి అన‌ర్హ‌త నోటీసులు అందుకున్న స‌చిన్ పైల‌ట్‌ (Sachin Pilot) తాజాగా మరో బాంబు పేల్చారు. తాను బీజేపీ పార్టీలో (Bharatiya Janata Party (BJP) చేరడం లేదని తెలిపారు. బీజేపీలో (BJP) చేరుతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను స‌చిన్ పైల‌ట్ ఖండించారు. రాజస్థాన్‌లో రసవత్తరంగా మారిన రాజకీయం, రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పూర్తి మెజారిటీ ఉందంటూ వివరణ

కాగా కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల‌కు హాజ‌రు కానందున్న వ‌ల్ల అన‌ర్హ‌త వేటు వేస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. పైల‌ట్‌తో పాటు ఆయ‌న‌తో ఉన్న ఇత‌ర ఎమ్మెల్యేల‌కు కూడా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న ఆరోప‌ణ‌ల‌పై నోటీసులు జారీ చేశారు. అసెంబ్లీ స్పీక‌ర్ మొత్తం 19 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స‌మావేశాల‌కు హాజ‌రు కానందున్న వ‌ల్ల అన‌ర్హ‌త వేటు వేస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రంగంలోకి ప్రియాంకా గాంధీ, రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 డిమాండ్లను ఉంచిన సచిన్‌ పైలట్‌, విక్టరీ సింబల్ చూపిన అశోక్ గెహ్లాట్

రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై (Ashok Gehlot government) క‌త్తిదువ్విన పైల‌ట్‌ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ప‌ద‌వి నుంచి కూడా ఆయ‌న్ను తొల‌గించారు. గెహ్లాట్‌కు వ్య‌తిరేకంగా ఇద్ద‌రు మంత్రులు కూడా స‌చిన్ టీమ్‌లో చేరారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీపై పోరాడి గెలిచామ‌ని, ఇప్పుడు తానెందుకు బీజేపీలో చేరాల‌ని పైల‌ట్ ప్ర‌శ్నించారు. తాను బీజేపీలో చేరుతున్న‌ట్లు ఓ త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని ఆయ‌న అన్నారు.

సచిన్‌ పైలట్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించటంతో ఆయనకు మద్దతుగా అనేకమంది నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు సీనియర్‌ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయి ప్రకటనలు చేస్తుండటంతో ప్రభుత్వం మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వంలో సంక్షోభం ముగిసిందని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రకటించగా, సభలో బలం నిరూపించుకోవాలని పైలట్‌ వర్గంతోపాటు ప్రతిపక్ష బీజేపీ డిమాండ్‌ చేశాయి. సీఎం గెహ్లాట్‌ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశమై తాజా పరిణామాలపై చర్చించింది.

అనంతరం గవర్నర్‌ కల్‌రాజ్‌మిశ్రాను కలసిన సీఎం గెహ్లాట్‌, డిఫ్యూటీ సీఎం పదవినుంచి పైలట్‌ను తొలగించాలని కోరటంతో ఆ మేరకు రాజ్‌భవన్‌ ఆదేశాలు జారీచేసింది. రాత్రి 7.30 గంటలకు సమావేశమైన రాజస్థాన్‌ క్యాబినెట్‌ సీఎం గెహ్లాట్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సచిన్‌పైలట్‌ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. సచిన్‌పైలట్‌ మద్దతుదారులు కూడా సీఎం గెహ్లాట్‌పై ఎదురుదాడి తీవ్రం చేశారు. బహిష్కరణ అనంతరం ట్విట్టర్‌లో స్పందించిన పైలట్‌ ‘సత్యం మాట్లాడేవారిని వేధింపులకు గురిచేయవచ్చు. కానీ వారు ఓడిపోరు’ అని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు జితిన్‌ ప్రసాద్‌, సంజయ్‌ఝా కూడా సచిన్‌ పైలట్‌కు మద్దతు ప్రకటించారు. దాంతో సంజయ్‌ ఝాను పార్టీనుంచి బహిష్కరించారు.

200 మంది సభ్యులున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 107మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఎం, భారతీయ టైబల్‌ పార్టీకి ఇద్దరు చొప్పున, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు ఒక సభ్యుడు ఉన్నారు. బీజేపీకి 72మంది బలముండగా, 13మంది స్వతంత్రులు ఉన్నారు. సీపీఎం, బీటీపీతోపాటు ముగ్గురు స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.