Rajasthan Political Crisis: రాజస్థాన్‌లో రసవత్తరంగా మారిన రాజకీయం, రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను కలిసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, పూర్తి మెజారిటీ ఉందంటూ వివరణ
After Sachin Pilot’s sacking, Rajasthan CM Ashok Gehlot meets Governor Kalraj Mishra (Photo-ANI

Jaipur, July 14: రాజస్ధాన్‌లో రాజకీయ సంక్షోభం (Rajasthan Political Crisis) అనూహ్య మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను (Governor Kalraj Mishra) కలిశారు. అసెంబ్లీలో తనకు పూర్తి మెజారిటీ ఉందని గవర్నర్‌కు వివరించారు. అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) సీఎల్పీ సమావేశానికి మరోసారి గైర్హాజరు కావడంతో ఆయనను పార్టీ చీఫ్‌ సహా ఉప ముఖ్యమంత్రి పదవుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తప్పించింది. రంగంలోకి ప్రియాంకా గాంధీ, రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 డిమాండ్లను ఉంచిన సచిన్‌ పైలట్‌, విక్టరీ సింబల్ చూపిన అశోక్ గెహ్లాట్

సచిన్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాల సోమవారం మధ్యాహ్నం ప్రకటించారు. పైలట్‌తోపాటు మరో ఇద్దరు అసమ్మతి మంత్రులు రమేష్‌మీనా, విశ్వేంద్రసింగ్‌లను కూడా మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంది. గత నాలుగు రోజులుగా అధిష్టానం అనేకమార్లు జరిపినప్పటికీ పైలట్‌, అతని వర్గం ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదని సుర్జేవాలా ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు.

Here's ANI Tweet

ఈ పరిస్థితులు ఇలా ఉంటే సచిన్‌ పైలట్‌ వర్గం తమకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెపుతుండగా, అశోక్ గెహ్లాట్ శిబిరం తమకు 106 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని వెల్లడించింది. అశోక్ గెహ్లాట్ సర్కార్‌ మైనారిటీలో పడినందున సభలో గహ్లోత్‌ ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోవాలని బీజేపీ పట్టుబట్టింది. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పైలట్‌ను పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్‌ దుయ్యబట్టింది. ప్రలోభాలతో ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు కాషాయ దళం ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

CM Ashok Gehlot meets Governor Kalraj Mishra, at Raj Bhawan in Jaipur.

పార్టీ మారితే రూ 15 కోట్లు ఇచ్చేందుకు తమ ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్‌ చేసిందని రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఫిరాయింపుల ద్వారా అధికార పగ్గాలను చేపట్టిన బీజేపీ రాజస్ధాన్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పైలట్‌తో ఎలాంటి చర్చలూ జరపలేదని పేర్కొనడం ఆశ్చర్యపరిచే అంశంగా చెప్పాలి. రాజస్థాన్ పొలిటికల్ డ్రామాలో కీలక మలుపు, బీజేపీలో చేరడం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్, కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సస్పెన్స్

200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సొంత బలం 107. ప్రభుత్వ మనుగడకు 101 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం 102 ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. తనను పదవుల నుంచి తొలగించడంపై సచిన్‌ పైలట్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘వాస్తవాన్ని వేధించగలరు, కాని ఓడించలేరు’ అంటూ ట్వీట్‌ చేశారు. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలను పైలట్‌ తోసిపుచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రెస్ మీట్ ద్వారా మరిన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు.

ఇదిలా ఉంటే సచిన్ పైలట్‌ను బీజేపీ‌లో‌కి స్వాగతిస్తామని రాజస్థాన్‌కు చెందిన ఆ పార్టీ నేత ఓం మాథుర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయనకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. బీజేపీలో చేరాలని భావించే ఎవరికైనా తాము స్వాగతం పలుకుతామని ఓం మాథుర్ తెలిపారు. సచిన్ పైలట్, సీఎం అశోక్ గెహ్లాట్ మధ్య వివాదం కాంగ్రెస్ అంతర్గత విషయమని, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ సచిన్ బీజేపీలో చేరితే ఆయనకు సీఎం పదవి కట్టబెట్టే అంశాన్ని పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తుందని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని సీఎం అశోక్ గెహ్లాట్‌ భావిస్తే ఆయన వెంటనే అసెంబ్లీ‌లో తన బలాన్ని నిరూపించుకోవాలని ఓం మాథుర్ డిమాండ్ చేశారు.