Rajasthan Political Drama: రంగంలోకి ప్రియాంకా గాంధీ, రిసార్టుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అధిష్టానం ముందు 3 డిమాండ్లను ఉంచిన సచిన్‌ పైలట్‌, విక్టరీ సింబల్ చూపిన అశోక్ గెహ్లాట్
Congress MLAs being taken in bus to a resort outside Jaipur | (Photo Credits: ANI)

Jaipur, July 13: రాజస్ధాన్‌ ముఖ్యమం‍త్రి అశోక్ గెహ్లాట్ సర్కార్‌పై ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) తిరుగుబాటుతో చెలరేగిన రాజకీయ ప్రకంపనలు (Rajasthan Political Drama) కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్ర రాజకీయం (Rajasthan Political Crisis) కీలక మలుపులు తిరుగుతోంది. కొద్ది సేపటి క్రితం సీఎల్పీ సమావేశం ముగియగా.. మొత్తం 107 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. 102 మంది ఎమ్మెల్యేలతో గెహ్లాట్ (Ashok Gehlot) బలప్రదర్శన చేశారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ప్రకటిస్తూ సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. సీఎల్సీ భేటీ తర్వాత ఎమ్మెల్యేలను బస్సుల్లో రిసార్ట్స్‌లకు (Resort Outside Jaipur) తరలించారు.

ఈ సమావేశంలో పాల్గొని బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అంతా సజావుగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. 102 మంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారని అశోక్ గెహ్లాట్ వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఇంకోవైపు సచిన్ పైలట్ కాంగ్రెస్‌ను వీడబోరంటూ శివకుమార్ ప్రకటించారు.

Update by ANI 

సచిన్ పైలట్‌తో అటు రాహుల్, ఇటు ప్రియాంక మాట్లాడారు. ఆవేశపడవద్దని సూచించారు. ఈ మొత్తం పరిణామాలకు బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఒక ప్రకటనలో ఆరోపించింది. రాజస్థాన్‌లో సుస్థిరమైన పాలన అందిస్తున్న కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపించింది. రాజస్థాన్ పొలిటికల్ డ్రామాలో కీలక మలుపు, బీజేపీలో చేరడం లేదని తెలిపిన డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్, కొనసాగుతున్న రాజస్థాన్ రాజకీయ సంక్షోభం సస్పెన్స్

25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించిన సచిన్‌ పైలట్‌ కాంగ్రెస్ అధిష్టానం ముందు మూడు ప్రధాన డిమాండ్లను ఉంచారని తెలుస్తోంది. తన వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వాలని, కీలక హోం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కేటాయించాలని, పీసీసీ చీఫ్‌గా తనను కొనసాగించాలని ఆయన పట్టుబట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పార్టీతో అన్ని విషయాలను చర్చించిన మీదట సచిన్‌ పైలట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.

కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో రెబెల్‌ నేత సచిన్‌ పైలట్‌ గహ్లోత్‌కు సహకరిస్తారా..లేక బీజేపీ గూటికి చేరతారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.