Amit Shah Learning Bangla Language: అమిత్ షా కొత్త స్కెచ్, మమతను ఢీకొట్టేందుకు బెంగాలీ భాషతో కుస్తీ, ఆత్మగౌరవ నినాదాన్ని లేవదీసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, ధీటుగా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్న హోం మంత్రి అమిత్ షా

కమ్యూనిస్టుల కంచుకోటను కూలదోసి అధికారాన్ని ఏలుతున్న మమతా బెనర్జీని ఢీ కొట్టేందుకు బెంగాలీ భాషను నేర్చుకునే పనిలో పడ్డారు. పశ్చిమ బెంగాల్ లో కాషాయపు జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న అమిత్ షాకు అక్కడ భాష అనేది ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఈ మధ్య సీఎం మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) ఆత్మ గౌరవ నినాదాన్ని లేవనెత్తారు.

Amit Shah learning Bangla to prepare for West Bengal polls (photo-PTI)

New Delhi,January 03: ఊహించని ఎన్నికల వ్యూహాలతో బీజేపీని(BJP) పరుగులు పెట్టిస్తున్న కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా (Home minister Amit shah) మరో కొత్త వ్యూహానికి రెడీ అవుతున్నారు. కమ్యూనిస్టుల కంచుకోటను కూలదోసి అధికారాన్ని ఏలుతున్న మమతా బెనర్జీని ఢీ కొట్టేందుకు బెంగాలీ భాషను నేర్చుకునే పనిలో పడ్డారు.

పశ్చిమ బెంగాల్ లో కాషాయపు జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న అమిత్ షాకు అక్కడ భాష అనేది ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఈ మధ్య సీఎం మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) ఆత్మ గౌరవ నినాదాన్ని లేవనెత్తారు.

మమతా బెనర్జీ ఇటీవలి తన ప్రసంగంలో ‘మా మాటీ మనుష్‌' (అమ్మ, మాతృభూమి, ప్రజలు)( 'Ma Mati Manush' (Mother, Motherland and People) అనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బెంగాలీల ఆత్మగౌరవంపై గట్టిగా మాట్లాడారు. అమిత్‌షాను బయటివ్యక్తి అని కూడా అన్నారు.

మమతా బెనర్జీ లాంటి పవర్ ఫుల్ లీడర్ ని ఢీ కొట్టే క్రమంలో భాష చాలా ముఖ్యమని గుర్తించిన అమిత్ షాAmit Shah)ఎన్నికల వ్యూహరచనలో భాష ప్రతిబంధకం కాకూడదని, ప్రచార సమయంలో బెంగాలీలో ప్రసంగించి అక్కడి ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీచర్ ని కూడా పెట్టుకున్నారు.

2021లో వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు(2021 West Bengal Assembly election) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి పశ్చిమ బెంగాల్ లో కాషాయపు జెండాను ఎగుర వేసేందుకు బీజేపీ ఇప్పటినుంచే పక్కా స్కెచ్ ని రెడీ చేస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో వ్యూహానికి పదును పెడుతూ వస్తోంది.

ఇప్పటికే ఎన్నార్సీ, సీఏఏలపై అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలకు సీఎం మమతా బెనర్జీ సైతం అండగా నిలుస్తున్నారు. వీటిని రాష్ట్రంలో అమలు చేస్తే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ ఎటువంటి వ్యూహాలతో దూసుకుపోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహరచనలో చాణుక్యుడిగా పేరున్న అమిత్‌షా ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ ఎన్నికల్లో (Maharashtra, Haryana and Jharkhand Assembly polls)నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బెంగాల్‌ ఎన్నికలను (West Bengal Assembly polls) ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు చేరువయ్యేందుకు అమిత్‌షా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారని, దీనిలో పెద్ద విషయం ఏమీలేదని, బెంగాలీ, తమిళంతోపాటు అమిత్‌షా నాలుగు భాషలను నేర్చుకుంటున్నారని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. కాగా అమిత్‌షా గుజరాతీతోపాటు హిందీలోనూ అనర్గళంగా మాట్లాడుతారు.