Delhi CM Kejriwal Turns Singer: హమ్ హోంగే కామియాబ్ పాటతో అదరగొట్టిన ఆప్ అధినేత, మూడోసారి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్, మంత్రులుగా 6 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi L-G Anil Baijal) కేజ్రీవాల్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్‌ ప్రచారంతో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ప్రజలు ఆయన్ని సీఎంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Arvind Kejriwal takes oath as Delhi CM | (Photo Credits: ANI)

New Delhi, February 16: ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) పీఠంపై సామాన్యుడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (Delhi L-G Anil Baijal) కేజ్రీవాల్ తో ప్రమాణస్వీకారం చేయించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్‌ ప్రచారంతో ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ప్రజలు ఆయన్ని సీఎంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఢిల్లీని గెలిచిన జోష్ లవర్ బాయ్‌గా మారిన అర్వింద్ కేజ్రీవాల్

ఆదివారం రాంలీలా మైదానంలో ‘ ధన్యవాద్‌ ఢిల్లీ’ ( Dhanyawad Dilli) పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం(Arvind Kejriwal Swearing-in Ceremony) నిర్వహించారు. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో ప్రజల మధ్యలో కేజ్రీవాల్ ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ప్రజలు పెద్దఎత్తున హాజరు అయ్యారు.

Here's Arvind Kejriwal takes oath as Chief Minister of Delhi 

ప్రమాణ స్వీకారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన స్పెషాలిటీ చూపించారు. హమ్ హోంగే కామియాబ్ (Hum Honge Kamyab) అనే దేశ భక్తి పాటను పాడారు. తనతో పాటు... మైదానంలో ఉన్న ప్రజలంతా కేజ్రీతో గొంతు కలిపారు. ఇలా ఏ రెండు లైన్లు కాదు మొత్తం పాట పాడారు.

Arvind Kejriwal Singhs 'Hum Honge Kamyab' Song:

కేజ్రీవాల్ ఎంతో ఉద్వేగంతో పాడిన పాటకు... అక్కడున్న వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరు అభిమానులు ఆయనతో కలిసి పాడారు. మూడోసారి కేజ్రీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. చివరలో భారత్ మాతాకి జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు.

దేశంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రులు వీరే

ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ శనివారం కేజ్రీవాల్‌ పిలుపునివ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.

ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న మినీ మఫ్లర్ మ్యాన్

పారిశుధ్య కార్మికులతో పాటు ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మెట్రో రైలు డ్రైవర్లు, స్కూల్ ఫ్యూన్లు సహా 50 మంది వీఐపీయేతర వ్యక్తులు ముఖ్యమంత్రితో పాటు వేదికను పంచుకున్నారు. వీరితో పాటు మాస్కో ఒలింపియాడ్స్‌లో పతకాలు సాధించిన విద్యార్ధులు, విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల కుటుంబ సభ్యులు, అగ్నిమాపక సిబ్బందిని కూడా ఆహ్వానించారు.

ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది.