Delhi CM Oath Ceremony: సామాన్యుడి పట్టాభిషేకానికి సామాన్యులే అతిధులు, పేరును సార్థకం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్య అతిథులుగా 50 మంది సాధారణ పౌరులు, ఫిబ్రవరి 16న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
Auto drivers, peons are VIP guests at Kejriwal’s swearing-in says AAP leader Manish Sisodia (photo-ANI)

New Delhi, Febuary 15: సామాన్యుడి పట్టాభిషేకానికి సామాన్యులే అతిధులుగా రానున్నారు. ఫిబ్రవరి 16న జరగబోయే అరవింద్ కేజ్రీవాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (Arvind Kejriwal’s oath-taking function) 50 మంది సాధారణ పౌరులను ఆప్ పార్టీ ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించనుంది.

ఈ నిర్ణయంతో ఆమ్‌ ఆద్మీపార్టీ (సామాన్యూడి పార్టీ) (AAP) తన పేరును సార్థకం చేసుకున్నట్లయింది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీపార్టీ విజయ ఢంకా మోగించిన విషయం విదితమే.

ఆదివారం జరగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (Delhi CM Oath Ceremony) 50 మంది సాధారణ పౌరులను ముఖ్య అతిథులుగా ఆప్‌ ఆహ్వానించిందని ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా (AAP leader Manish Sisodia) శనివారం మీడియాతో తెలిపారు.

Here's ANI Tweet

ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, రాజకీయ ప్రముఖులు, అధికార యంత్రాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు.. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, అంబులెన్స్‌, మెట్రో రైల్‌ డ్రైవర్లు, పాఠశాల ప్యూన్‌లు వేదిక పంచుకోనున్నారని ఆయన తెలిపారు.

ఢిల్లీని గెలిచిన జోష్ లవర్ బాయ్‌గా మారిన అర్వింద్ కేజ్రీవాల్

రామ్‌లీలా మైదానంలో జరిగే అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆప్‌ ఇప్పటికే కోరింది. మాస్కో ఒలింపియాడ్‌లో పతకాలు సాధించిన విద్యార్థులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బంది కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా సిసోడియా తెలిపారు.

ప్రమాణ స్వీకార ఏర్పాట్లు 

కాగా, మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 67సీట్లను ఆప్ సాధించిన విషయం విదితమే.

దేశంలో ఇప్పటివరకు హ్యాట్రిక్ ముఖ్యమంత్రులు వీరే

తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. ఢిల్లీలోని రామ్ లీలా గ్రౌండ్ లో ఆదివారం జరిగే కేజ్రీవాల్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మోడీ వ్యతిరేకులంతా హాజరవుతారని అందరూ ఇప్పటివరకు భావించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు,రాజకీయ నాయకులు ఎవ్వరినీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించట్లలేదని ఆమ్ ఆద్మీ పార్టీ గురువారం ప్రకటించింది.

ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న మినీ మఫ్లర్ మ్యాన్

ఢిల్లీ ప్రజలు మాత్రమే కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరవుతారని ఆప్ ఢిల్లీ యూనిట్ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. కేజ్రీవాల్ నాయకత్వంపై మరోసారి నమ్మకం ఉంచిన ఢిల్లీ ప్రజలతో కలిసి కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాయ్ తెలిపారు.