జార్ఖండ్‌ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జార్ఖండ్‌ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా (Jharkhand CM) జేఎంఎం చీఫ్‌ హేమంత్‌ సోరేన్‌ (Hemant Soren) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా హేమంత్‌ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.రాంచీ (Ranchi)లోని Morabadi Groundలో జరిగిన ఈ కార్యక్రమానికి హేమంత్‌ సోరెన్‌ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు షిబు సోరెన్‌, రూపి సోరెన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన భార్య సునితా కేజ్రీవాల్‌, ఎంపీ రాఘవ్‌ చద్ధా తదితరులు హాజరయ్యారు. ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 81 నియోజకవర్గాలకు గానూ జేఎంఎం కూటమికి 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్‌నాథ్‌ షిండే రాజీనామా, గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!

Hemant Soren Sworn in As Jharkhand CM:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)