Representational Image (Photo Credit: Pixabay)

Bangalore, NOV 28:  అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లోని కమోడ్‌లో పడేసి ఫ్లష్‌ చేశారు. (Baby Flushed in Toilet) నీరు బ్లాక్‌ కావడంతో క్లీనింగ్‌ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్‌ అయ్యారు. కర్ణాటకలోని (Karnataka) రాంనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరోహళ్లిలోని ఆసుపత్రిలో మురుగు నీటి పైపులు బ్లాక్‌ అయ్యాయి. దీంతో క్లీనింగ్‌ సిబ్బంది, ప్లంబర్లు పరిశీలించారు. పైపుల్లో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. బ్లాకేజీని తొలగించేందుకు ప్రయత్నించగా శిశువు మృతదేహం బయటపడింది.

Haryana: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బ్రా ధరించి మగవారిది పట్టుకుంటూ యువకుడు హల్ చల్, పట్టుకుని చితకబాదిన షాపు యజమానులు, వీడియో ఇదిగో.. 

కాగా, ఆసుపత్రి సిబ్బంది దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పసిబిడ్డ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన వారు ఇది బయటపడకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

Jalaun Horror: యూపీలో దారుణం, మహిళ ప్రైవేట్ భాగాల్లో కర్రను చొప్పిస్తూ సామూహిక అత్యాచారం, తర్వాత కారం పోసి కామాంధులు పైశాచికానందం 

మరోవైపు నవజాత శిశువు మిస్సింగ్‌పై ఆ ఆసుపత్రి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శిశువును బయట నుంచి తెచ్చి ఆసుపత్రిలోని కమోడ్‌లో పడేసి ఫ్లష్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.