MP Floor Test: కరోనా ఎఫెక్ట్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 26కి వాయిదా, అవిశ్వాస తీర్మానానికి రెడీ అంటున్న సీఎం కమల్ నాథ్, మాస్క్‌లతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు
అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికీ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా ఈ సమావేశాలకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు ఇంకా బెంగళూరులోని రిసార్ట్స్ లోనే ఉంటున్నారు. బీజేపీ శాసనసభ్యులు మాత్రం అందరూ హాజరయ్యారు. గురుగావ్ నుంచి వచ్చిన వీరు నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
Bhopal, Mar 16: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (Coronavirus) ప్రభావం మధ్యప్రదేశ్ అసెంబ్లీపై (MP Assembly ) పడింది. అసెంబ్లీ ప్రారంభమైన కొద్ది సేపటికీ ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా ఈ సమావేశాలకు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వారు ఇంకా బెంగళూరులోని రిసార్ట్స్ లోనే ఉంటున్నారు. బీజేపీ శాసనసభ్యులు (BJP MLAs) మాత్రం అందరూ హాజరయ్యారు. గురుగావ్ నుంచి వచ్చిన వీరు నేరుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మరో ట్విస్ట్
కాగా గవర్నర్ లాల్జీ టాండన్ (Governor Lalji Tandon) ఈరోజు కమల్ నాధ్ ప్రభుత్వం (Kamal nath Govt) విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ రోజు విశ్వాసపరీక్ష (Madhya Pradesh floor test) జరుగుతుందనుకున్నారు. విశ్వాస పరీక్షకు వెనుకడుగు వేసేది లేదని సిఎం కమలనాథ్ కూడా ప్రకటించారు.
అయితే అసెంబ్లీలో చేరాల్సిన ఈ అంశం చేర్చలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానం తప్పించి విశ్వాస పరీక్ష అంశం ఎజెండాలో కనిపించలేదు. కాగా, స్పీకర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బలపరీక్షకు సిద్ధమని సిఎం మరోసారి పునరుద్ఘాటించారు.
Here's ANI Tweet
గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే స్పీకర్ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. దీంతో కమల్ నాధ్ ప్రభుత్వ బలపరీక్షకు బ్రేక్ పడింది.
కాగా సీఎం కమల్ నాథ్ సహా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది మాస్కులతో సభకు వచ్చారు. కరోనా భయంతో అంతా మాస్కులు ధరించారు. ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకునే సభకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సహా ఎమ్మెల్యేలంతా మాస్కులతో కనిపించారు. మన దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా సభ్యులంతా మాస్కులు ధరించారు.
సంక్షోభంపై షాకిచ్చిన కమల్ నాథ్ సర్కార్
కొద్ది రోజుల క్రితం జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో కమల్‌నాథ్ సర్కారుకు ఇబ్బందులు మొదలయ్యాయి. మెజారిటీ మార్కును తగ్గించేందుకు ఆరుగురు మినిస్టర్లు సహా 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే మంత్రుల రాజీనామాలను స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతి శనివారం ఆమోదించారు. ఒక వేళ మిగతా 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను కూడా స్పీకర్ ఆమోదిస్తే.. 107 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది.
అవిశ్వాస తీర్మానపు వ్యూహంలో బీజేపీ, అత్యవసరంగా సోనియా గాంధీతో భేటీ అయిన మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్
మంత్రుల రాజీనామాల ఆమోదం తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 222కు తగ్గనుంది. దీంతో మెజార్టీ మార్కు 112కు తగ్గింది. పార్టీలో తిరుగుబాటుకు ముందు 114 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ బలం ప్రస్తుతం 92. ఆ పార్టీకి నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది.
ఎవరీ జ్యోతిరాదిత్య సింధియా, ఎందుకు కమల్ నాథ్ సర్కార్‌ని వణికిస్తున్నాడు
ప్రస్తుతం బీజేపీ బలం 107. మెజారిటీకి ఆ పార్టీకి ఇంకా ఐదుగురు సభ్యులు కావాలి. రాజీనామా చేసిన 16 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతు ఎవరికి ఉంటుందనే దానిపై కమల్‌నాథ్ సర్కారు భవిష్యత్తు ఆధారపడి ఉంది.
అసెంబ్లీలో బలాబలాలు
మొత్తం సభ్యులు 222(230)
మెజారిటీ మార్కు 112
కాంగ్రెస్ 92
బీజేపీ 107
ఎస్పీ 1
బీఎస్పీ 2
ఇండిపెండెంట్లు 4
కాంగ్రెస్ రెబెల్స్ 16
(ఖాళీలు 8)