Maha Election Results 2019: మహారాష్ట్రలో కాషాయం కూటమి రెపరెపలు, సీఎం సీటు కోసం డిమాండ్ చేస్తున్న శివసేన, ప్రతిపక్ష పాత్ర పోషించనున్న యూపీఎ కూటమి, ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసిన బీజేపీ కూటమి
ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Mumbai, October 24: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ-శివసేన కూటమి మధ్య సీఎం సీటు హాట్ టాపిక్ గా మారింది. సీఎం సీటు కోసం మహారాష్ట్రలో బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు శివసేన ప్రయత్నిస్తోంది. కాగా 288 స్థానాల్లో కేవలం 101 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యం కనబర్చింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ హవా తగ్గింది. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 101 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో 63 స్థానాల్లో సత్తా చాటిన శివసేన తాజా ఎన్నికల్లో కూడా 60 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబర్చింది. ఫలితాలు వెలువడక ముందే బీజేపీ సంబరాలు
ఈ నేపధ్యంలో సీఎం పదవీ కాలాన్ని చెరిసగం పంచుకోవాలని బీజేపీకి శివసేన ప్రతిపాదన పంపినట్లు సమాచారం. తొలి అవకాశం తమకే ఇవ్వాలని కూడా శివసేన కోరినట్లు తెలిసింది. ఆదిత్య ఠాక్రేను సీఎం చేయాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనకు బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హూజూర్ నగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం
బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే శివసేన డిమాండ్లకు తలొగ్గక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి.. శివసేన పంపిన ప్రతిపాదనలో మార్పులుచేర్పులకు బీజేపీ సూచనలు చేస్తుందా లేక శివసేన మాటే నెగ్గుతుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఒకవేళ శివసేనకు సీఎం సీటుని బీజేపీ ఇవ్వాలనుకుంటే గతంలో కర్ణాటకలో ఫాలో అయిన విధానాన్ని అనుసరించే అవకాశముంది. గతంలో కర్నాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చెరి రెండున్నరేళ్లు సీఎం సీటుని షేర్ చేసుకోవాలని భావించారు. మొదటగా జేడీఎస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే రెండున్నరేళ్ల తర్వాత కుమారస్వామి బీజేపీకి షాక్ ఇచ్చారు. సీఎం సీటు దిగేందుకు నిరాకరించారు. చివరికి బీజేపీకి మద్దతు ఉపసంహిరంచుకుని ప్రభుత్వాన్ని కూల్చేశారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఇలాంటి ఫార్ములాని బీజేపీ పాటిస్తుందా లేక శివసేనకు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసి అంతటితో సరిపెడుతుందా అనేది వేచి చూడాలి. హర్యానాలో మళ్లీ కర్ణాటక సీన్
ఇప్పటికే మహా సీఎంగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపడతారని హోంశాఖా సహాయమంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. అటు ప్రధాని మోడీ కూడా ఫడ్నవీస్‌నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.