Maha Elections 2019: Confident Of Win, Maharashtra BJP Orders 5,000 Laddoos Ahead Of Counting (Photo-ANI)

Mumbai, Octoner 24: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడనే లేదు. అప్పుడే బీజేపీ సంబరాలకు సిద్ధమైంది. విజయం మాదే అే ధీమాతో ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ ఆద్వర్యంలోని మహారాష్ట్ర బీజేపీ సెలబ్రేషన్స్ కు ప్రిపేర్ కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఇందుకోసం ఏకంగా బీజేపీ రాష్ట్ర శాఖ కౌంటింగ్‌కు ముందే 5000 లడ్డూలు, పెద్దసంఖ్యలో పూలదండలకు ఆర్డర్‌ ఇచ్చింది. అలాగే పార్టీ ముంబై కార్యాలయంలో ఎన్నికల ఫలితాలను ప్రదర్శించేందుకు భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమికి భారీ విజయం దక్కుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌సైతం వెల్లడించాయి. ఈ క్రమంలో కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం అంబరాన్ని తాకింది.

మొత్తం 288 స్ధానాలకు గాను బీజేపీ-శివసేన కూటమికి 197 స్ధానాలు లభిస్తాయని సీఎన్‌ఎన్‌ న్యూస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించింది. దాదాపు 11 ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ-సేన కూటమికి 211 స్ధానాల వరకూ దక్కుతాయని అంచనా వేశాయి. ప్రసుత్తం మహారాష్ట్ర అసెంబ్లీలో ఇరు పార్టీలకూ 217 స్ధానాలున్నాయి.

తాము అధికారంలోకి వస్తామని తమకు తెలుసని..అయితే ఎన్ని స్ధానాలు లభిస్తాయనే దానిపైనే ఉత్కంఠ నెలకొందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అక్టోబర్‌ 21న ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో 61.13 శాతం ఓటింగ్‌ నమోదైంది.

లడ్డులు ఆర్డర్ ఇచ్చిన బీజేపీ

కాగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ముందు రోజు బుధవారం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ కూడా బీజేపీ చేసిన తప్పులే మమ్మల్ని గెలిపిస్తాయనే ధీమాతో ఉంది. మరో పార్టీ ఎన్సీపీతో కాంగ్రెస్ అక్కడ జట్టుకట్టిన సంగతి విదితమే.