Parliament (photo-ANI)

New Delhi, Dec 17: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రణాళిక ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకొచ్చింది. ఎన్‌డీయే నేత్వంలోని కేంద్రం ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశ పెట్టింది.బిల్లును జాయింట్ పార్లమెంట్‌ కమిటీ (JPC) కి పంపడానికి ముందు ఓటింగ్ నిర్వహించింది.

లోక్‌సభలో ఓటింగ్‌ నిర్వహించగా అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లును జేపీసీకి పంపేందుకు లోక్‌సభ ఆమోదం లభించినట్లైంది.అయితే, లోక్‌సభలో జమిలి ఎన్నికల బిల్లుపై చర్చ జరిగే సమయంలో 20మంది బీజేపీ ఎంపీలు గైర్హాజరయ్యారు.వీరందరికీ బాధ్యతారాహిత్యం కింద నోటీసులు జారీ చేసింది.

జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

రాజ్యాంగాన్ని సవరించి ఏకకాలంలో పార్లమెంటరీ, రాష్ట్రాల ఎన్నికలను అనుమతించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఎంపీల గైర్హాజరు అడ్డంకి కాదు. కానీ, ఇదే అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నాయి. జమిలి ఎన్నికలు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని, అందుకు ఆ 20 మంది బీజేపీ ఎంపీల తీరేనని విపక్ష కూటమి ఆరోపిస్తోంది.రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ అన్నారు.

One Nation One Election Bill accepted in Lok Sabha

కాగా పార్లమెంట్‌ నూతన భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్ విధానం ద్వారా ఈ ఓటింగ్‌ నిర్వహించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌పై అనుమానం ఉన్న వాళ్లు ఓటింగ్‌ స్లిప్‌లతో క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు స్పీకర్‌ అనుమతించారు. ఇది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు.