astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి, శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే డిసెంబర్ 23వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా తిరోగమనలో కదులుతాయి. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మకర రాశి- మకర రాశి వారికి బుధుడు, శుక్రుడు తిరోగమన కదలిక వల్ల అన్ని సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చాలా కష్టపడతారు. ఆ కష్టానికి తగిన ఫలితంగా పోటీ పరీక్షల్లో ఉద్దీన్లలో అవుతారు .వ్యాపారంగంలో మీరు ముందంజలో ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే పెట్టుబడును మంచి లాభాలను ఇస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి లాభాలు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలనుకున్న కళ నెరవేరుతుంది.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

కన్య రాశి- కన్య రాశి వారికి బుధుడు, శుక్రుడు తిరుగమన కదలిక మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటినుంచ పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. దీని ద్వారా మీకు మంచి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఎప్పటినుంచో ఇబ్బందుల్లో ఉన్న కోర్టు సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో కుటుంబం ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. కోరుకున్న రంగాల్లో వీరికి సీటు లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలని కల నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న తగాదాలు తొలగిపోతాయి. అందరూ కలిసి విహారయాత్రలకు వెళతారు. ఇది మీకు సంతోషాన్ని కలిగించే విషయంగా ఉంటుంది.

కుంభరాశి- కుంభ రాశి వారికి తిరోగమన కలయిక వల్ల మంచి శుభ పరిణామాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటినుంచో కొనాలనుకుంటున్నాను నూతన గృహం కళ నెరవేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఇది మీకు జీతాన్ని పెంచుతుంది. అంతేకాకుండా కోరుకున్న చోట బదిలీ అవుతుంది. మీరు పని చేసే చోట పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అద్దుతాయి. సహోదయోగులతో సఖ్యత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లలు పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇది తల్లిదండ్రులకు ఆనందం కలిగించే విషయంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీనివల్ల మీకు మానసిక ఆందోళన తగ్గుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.