జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. కొత్త సంవత్సరం రానుంది. ఈ లోపున శక్తివంతమైన గ్రహాలు సంచరించబోతున్నాయి. ఈ రాశి చక్రాల గుర్తులపైన ప్రభావాలను చూపిస్తాయి. శని గ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా చెప్పవచ్చు.ఇది నెమ్మదిగా కదిలే గ్రహం డిసెంబర్ 29వ తేదీన శని గ్రహం కుంభరాశి నుంచి బయటికి వచ్చి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. శని సంచారం కారణంగా అన్ని రాశులు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి చాలా లాభాలు ఉంటాయి. శని దేవుని అనుగ్రహం ఏ రాశి వారికి కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి- మేష రాశి వారికి శని సంచారం కారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు తీసుకున్న పాత అప్పులను తిరిగి చెల్లిస్తారు. పెట్టుబడుల నుంచి ఆశించిన కంటే ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళతారు. వ్యాపార విస్తరణ కోసం విదేశాలలో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు లాభాలను తీసుకొని వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
మీన రాశి- మీన రాశి వారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శని అనుగ్రహం వల్ల వీరి జాతకంలో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగం చేసే వరకే ప్రమోషన్ లభిస్తుంది. ఇది మీకు జీతాన్ని రెట్టింపు చేసే విధంగా ఉంటుంది. దీనితో మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొత్త సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయి కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది ఆదాయం పెరుగుతుంది.
Vastu Tips: శని మిమ్మల్ని పట్టి పీడిస్తోందని భావిస్తున్నారా,
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ సకాలంలో పూర్తీ అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో మీ పనితీరుని అభినందిస్తారు. దీంతో మీకు ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పని చేసే ప్రతి పని కూడా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్నచోట బదిలీ అవుతుంది. జీతం రెట్టింపు అవుతుంది. దీనివల్ల మీకు ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని కళ నెరవేరుతుంది స్టాప్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.