Sanjay Raut: వారిని అండమాన్ జైల్లో నిర్బంధించాలి, వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇచ్చి తీరాలంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్, కాంగ్రెస్ పార్టీ ఇకనైనా శివసేన దారిలో నడవాలంటూ చురక, బెల్గాంలో చేదు అనుభవం
సాయి జన్మస్థలంపై (Sai Birth Place) వివాదం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడుగా గతంలో వివాదం రేపిన వీర్ సావర్కర్ (Veer Savarkar)అంశం మళ్లీ తెరమీదకు చేరింది. ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు(Vinayak Damodar Savarkar) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) ఇచ్చి తీరాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైన గళం విప్పితే వారందరిని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో (Andaman Jail)నిర్బంధించాలని అన్నారు.
Mumbai, January 18: మహారాష్ట్రలో(Maharashtra) కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. సాయి జన్మస్థలంపై (Sai Birth Place) వివాదం ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి తోడుగా గతంలో వివాదం రేపిన వీర్ సావర్కర్ (Veer Savarkar)అంశం మళ్లీ తెరమీదకు చేరింది. ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్‌కు(Vinayak Damodar Savarkar) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) ఇచ్చి తీరాల్సిందేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut)డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎవరైన గళం విప్పితే వారందరిని అరెస్ట్ చేసి అండమాన్ జైల్లో (Andaman Jail)నిర్బంధించాలని అన్నారు.
శనివారం ఆయన ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వీర్ సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని శివసేన తొలినుంచి డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తుచేశారు. దీనిపై కాంగ్రెస్ భిన్నవాదనలను వినిపిస్తోందని, తమ నిర్ణయాన్ని ఆ పార్టీ గౌరవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Here's ANI Tweet
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన సేవ, త్యాగం ఎంతో గొప్పదని రౌత్ అభిప్రాయపడ్డారు. కాగా వీర్ సావర్కర్‌కు వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. ఆయన కృషికి గుర్తింపుగా అత్యున్నత పురస్కారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రౌత్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు సావర్కర్ మనవడు.. రంజిత్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Here's ANI Tweet
ఇకనైనా కాంగ్రెస్ పార్టీ శివసేన(Shiv Sena) దారిలో నడవాలని అన్నారు. మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి వస్తే.. వీరసావర్కర్‌కు భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ
ఇదిలా ఉంటే కర్ణాటక బీజేపీ ప్రభుత్వంపై (Bharatiya Janata Party-led Karnataka government)సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. బెల్గాంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనను పోలీసులు(Karnataka Police) అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇది బెల్గాం(Belgaum) లేదంటే ఇతర దేశమా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
Here's ANI Tweet
దేశంలోకి పాకిస్తానీలు ప్రవేశించొచ్చు, బంగ్లాదేశ్‌కి చెందిన రోహింగ్యాలు కూడా ప్రవేశించొచ్చు.. కానీ బెల్గాం జిల్లాలోకి మహారాష్ట్రీయులు అడుగుపెట్టొద్దా అని ప్రశ్నించారు. ఒకరిపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉండకూడదని, ఇది చాలా తప్పని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తనను అరెస్ట్ చేసిన పోలీసులు తెలియని ప్రదేశానికి తరలించారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో
ఇదిలా ఉంటే మరోవైపు మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర పాటిల్ యెద్రవ్‌కర్ కూడా బెలాగవి జిల్లాలో ఛేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే కొందరు మాట్లాడనీయకుండా అడ్డుకొని దాడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు మంత్రిని మాట్లాడనీయకుండా అడ్డుకొని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Here's Sanjay Raut Tweet
1980లో చనిపోయిన మరాఠీ అనుకూల అమరవీరుల దినోత్స కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి విచ్చేసిన సంగతి తెలిసిందే.
కీలక శాఖలన్నీ ఎన్పీపీ గుప్పెట్లో
ఒకప్పటి ముంబై డాన్ కరీం లాలాను కలిసేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Indira Gandhi) దక్షిణ ముంబై వచ్చేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్...కాంగ్రెస్ మండిపడటంతో వెనక్కి తగ్గారు. కరీం లాలాను కలుసుకునేందుకు చాలా మంది ప్రముఖులు ముంబైకి వచ్చేవారంటూ ఇందరాగాంధీపై తన వ్యాఖ్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు.
Here's ANI Tweet
'కరీంలాలా పఠాన్ నేత. 'ఫక్తూన్-ఇ-హింద్' అనే సంస్థకు నాయకత్వ వహించేవారు. ఆయన తనకున్న నాయకత్వ పలుకుబడి కారణంగా ఇందిరాగాంధీతో పాటు అనేక మంది అగ్రనేతలను కలుసుకునే వారు. ముంబై చరిత్ర తెలియని వారు మాత్రమే నా వ్యాఖ్యలకు వక్ర భాష్యాలు చెబుతున్నారు' అని తాజా ట్వీట్‌లో సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
Here's ANI Tweet
ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని, అలా చెప్పేందుకు తాను ఎప్పుడూ వెనుకాడలేదని అన్నారు. ఇందిరాగాంధీ, పండిట్ నెహ్రూ, రాజీవ్ గాంధీతో సహా గాంధీల కుటుంబంపై తనకెంతో గౌరవం ఉందని, ఇందిరాగాంధీని ఎవరు టార్గెట్ చేసి మాట్లాడినా ఆమెకు దన్నుగా నిలిచేవాడినని తెలిపారు.
మీరిలా ఉంటే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారు
సంజయ్ రౌత్ ఓ కార్యక్రమంలో కరీంలాలాను కలుసుకునేందుకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముంబై వెళ్లేవారని వ్యాఖ్యానించారు. 'అప్పట్లో దావుద్ ఇబ్రహీం, ఛోటా షకీల్, శరద్ షెట్టీలు ముంబై పోలీస్ కమిషనర్‌గా ఎవరుండాలో, మంత్రాలయాలో ఎవరు కూర్చువాలో నిర్ణయించే వారు. కరీంలాలాను ఇందిరాగాంధీ వెళ్లి కలుసుకునేవారు' అని వ్యాఖ్యానించిన సంగతి విదితమే.