Shiv Sena MP Sanjay Raut (Photo Credits: ANI)

New Delhi, December 15: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) ‘రేప్ ఇన్ ఇండియా’ (Rape In India) వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశాన్ని, మహిళల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అధికార పార్టీ బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. మహిళలపై అకృత్యాల్ని పెంచేదిగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఫైర్ అవుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు.

ఢిల్లీలో రాంలీలా మైదాన్‌లో జరిగిన కాంగ్రెస్‌ భారత్‌ బచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్‌ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని.. తాను ‘రాహుల్‌ సావర్కర్‌ను కాదు’ రాహుల్ గాంధీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే, మహారాష్ట్రలో కాంగ్రెస్‌(Congress)తో కలిసి అధికారంలో ఉన్న శివసేన (Shiv sena) రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందించింది. హిందుత్వ పితామహుడు.. భరత జాతికి ఎనలేని సేవలు చేసిన వీర సావర్కర్‌ (veer savarkar)పేరును తక్కువ చేసి మాట్లాడొద్దని సూచించింది.

ANI Tweet

మహాత్మా గాంధీ(Mahatma Gandhi), జవహర్‌లాల్‌ నెహ్రూ(jawaharlal nehru) మాదిరిగా వీర సావర్కర్‌ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) గుర్తు చేశారు. సావర్కర్‌ గౌరవానికి భంగం కలిచించే రీతిలో మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

See Sanjay Raut's Tweet

ట్విట్టర్‌ వేదికగా ఆయన విరుచుకుపడ్డారు. స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర్ వీర సావర్కర్ భారత దేశ మహనీయుడు. ఆయన కేవలం మహారాష్ట్రకే పరిమితం కాదు. జాతిపిత మహాత్మ గాంధీ, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ లాగే వీరసావర్కర్‌ కూడా దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు’అని పేర్కొన్నారు.