Uddhav Thackeray: లోక్‌సభలో మద్దతు, రాజ్యసభలో మద్దతు ఇవ్వం, పౌరసత్వ సవరణ బిల్లుపై స్వరం మార్చిన శివసేన, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే బిల్లుకు మద్ధతు, వెల్లడించిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభలో తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు.
Mumbai, December 10: బీజేపీ (BJP) ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకు వస్తున్న పౌరసత్వ బిల్లుపై(Citizenship Amendment Bill 2019) శివసేన పార్టీ స్వరం మార్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభలో తాము మద్దతు ఇవ్వబోమని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) తెలిపారు. దేశంలో ఏ పౌరుడైనా ఈ బిల్లు పట్ల భయం వ్యక్తం చేస్తే వారి సందేహాలను తీర్చాల్సిన అవసరముందని తెలిపారు. వాళ్లు కూడా మన పౌరులేనని,ప్రభుత్వం తప్పనిసరిగా వారి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలని ఉద్దవ్ తెలిపారు.
ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు ఈ బిల్లుకు మద్దతివ్వబోమని తెలిపారు. అయితే గత రాత్రి లోక్ సభలో పౌరసత్వ బిల్లుకు అనుకూలంగా శివసేన(Shiv sena) ఎంపీలు ఓటు వేసిన విషయం తెలిసిందే. లోక్ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశాం కానీ.. బుధవారం రాజ్యసభలో మాత్రం వ్యతిరేకంగా ఓటేస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ సంకేతాలిచ్చారు. అంటే ఒకే బిల్లుపై ఒకే పార్టీ ఉభయ సభల్లో రెండు రకాలుగా స్పందిస్తుంది.
Read the ANI Tweet Below
పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో చేసిన విమర్శలతో శివసేన అలర్టయి తన వైఖరిని మార్చుకున్నది. ఎందుకంటే మహారాష్ట్రలో(Maharashtra) ఎన్సీపీ(NCP), కాంగ్రెస్Congress)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన శివసేన ఈ బిల్లుకు లోకసభలో మద్దతు తెలిపింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మద్దతు తెలిపినట్లు పేర్కొంది. అయితే రాహుల్ విమర్శలతో తన వైఖరి మార్చుకున్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటించారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై యూఎస్ ఫెడరల్ కమీషన్ ఆందోళన
రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు. విపక్షాలు చేసిన సూచనలకు అనుగుణంగా బిల్లులో మార్పులు చేయాల్సిందేనని ఉద్ధవ్ ఠాక్రే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. లోకసభలో ఓటేసినట్లు రాజ్యసభలో ఓటు వేయబోమని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు.
కాగా పౌరసత్వ సవరణ బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగ నిబంధలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును భారత రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును సమర్థిస్తున్న వారు భారత మూలాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.