'Uddhav Thackeray Will Resign': మీరిలా ఉంటే సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారు, కాంగ్రెస్,ఎన్సీపీలను హెచ్చరించిన యశ్వంత్ రావ్ గఢఖ్, ఫిర్యాదులు చేయడం మానుకోవాలని హితవు, పతనం ప్రారంభమైందన్న దేవేంద్ర ఫడ్నవిస్

మహా కేబినెట్ విస్తరణపై అసమ్మతి రాజుకుంది. పదవులు మాకు ఇవ్వలేదంటూ కొందరు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రాజీనామాలతో కలకలం రేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఇలాగే ఉంటే మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా (Uddhav Thackeray Will Resign)చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్(Former Maharashtra Congress MP Yashwantrao Gadakh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Maharashtra Chief Minister Uddhav Thackeray (Photo-PTI)

Mumbai, January 13: మహారాష్ట్రలో రాజకీయాలు( Maharashtra Politics) మళ్లీ రసవతర్తంగా మారుతున్నాయి. మహా కేబినెట్ విస్తరణపై అసమ్మతి రాజుకుంది. పదవులు మాకు ఇవ్వలేదంటూ కొందరు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా రాజీనామాలతో కలకలం రేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు ఇలాగే ఉంటే మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా (Uddhav Thackeray Will Resign)చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్(Former Maharashtra Congress MP Yashwantrao Gadakh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేతలంతా సంయమనం పాటించాలని పార్టీపై అలగడం మంచిది కాదని కాంగ్రెస్,ఎన్సీపీలను(Congress, NCP) ఈ సందర్భంగా యశ్వంత్ హెచ్చరించారు. మంత్రిపదవుల కేటాయింపుపై కాంగ్రెస్,ఎన్సీపీలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మహత్యకు పాల్పడిన శివసేన కార్యకర్త

ఈ సమయంలోనే సరిగ్గా నడుచుకోండి లేదంటే ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారంటూ యశ్వంత్ రెండు పార్టీలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మూడుసార్లు అహ్మద్ నగర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన యశ్వంత్ రావ్ ఈ వ్యాఖ్యలు చేయడం అక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది.

మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ

ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray)రెగ్యులర్ పొలిటీషియన్ కాదని,ఆయనకు ఆర్టిస్ మెంటాలిటీ (he has the mentality of an artist)ఉందని ఆయన అన్నారు. మహావికాస్ అఘాడి ప్రభుత్వంలోని భాగస్వాములైన కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు పదవుల కేటాయింపై కంప్లెయిట్ లు చేయడం మానుకోవాలన్నారు. అలా చేయడం వల్ల పార్టీకే నష్టం అని తెలిపారు.

మూడు రోజుల ముచ్చటైన సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా

ఇటీవల ఉద్దవ్ ఠాక్రే చేపట్టిన కేబినెట్ విస్తరణ పట్ట పలువురు కాంగ్రెస్,ఎన్సీపీ,శివసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కేబినెట్ పదవులు,శాఖల కేటాయింపు విషయంలో మూడు పార్టీల్లోని నాయకుల మధ్య అసంతృప్తి నెలకొంది. పలువురు అయితే ఏకంగా పార్టీ పదవులకు,ఓ ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో రాజీనామా చేశారు.

300 మంది రైతుల ఆత్మహత్యలు, మహారాష్ట్రలో అధికార కుమ్ములాటకు బలైన కర్షకులెందరో

ఈ పరిస్థితులు ఇలా ఉంటే బీజేపీ శివసేనపై విమర్శలు ఎక్కుపెడుతోంది. చాలా మంది నాయకులు మహావికాస్ అఘాడి(Maharashtra Vikas Aghadi) ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారని,త్వరలోనే ప్రభుత్వం పడిపోతుందని ఉద్దవ్ ప్రభుత్వంపై కాషాయ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. మహావికాస్ అఘాడి ప్రభుత్వ పతనం ప్రారంభమైందని ఇటీవల ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.



సంబంధిత వార్తలు