Maharashtra Govt Upadets Devendra Fadnavis, Maharashtra CM for the 2nd time, tells BJP workers ‘Modi hai toh mumkin hai’(Photo-ANI)

Mumbai, November 23: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో అనూహ్య ట్విస్టుల మధ్య రాత్రికి రాత్రే సీఎంగా రెండవసారి ప్రమాణం స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ముందుకు వచ్చారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం ఫడ్నవిస్ ( Maharashtra CM Devendra Fadnavis) ధన్యవాదాలు తెలిపారు.

ముంబైలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఎట్టకేలకు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.అదే విధంగా ప్రధాని మోడీ (PM Modi), హోమం మంత్రి అమిత్ షా (Amit Shah)లకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా’అని అన్నారు. అజిత్ పవార్ (Ajit pawar) సహకారంతో మహారాష్ట్రలో బీజేపీ రానున్న అయిదేళ్లు సుస్థిర పాలన అందిస్తుందని అన్నారు. మోడీ ఉంటే అన్నీ సాధ్యమే (Modi hai toh mumkin hai) అని వెల్లడించారు.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: ఫడ్నవిస్

కాగా మహారాష్ట్రలో నెల రోజుల నుంచి సీఎం ఎవరు అనేదానిపై ట్విస్టులు మీద ట్విస్టులు నడిచిన సంగతి తెలిసిందే. అధికార ఏర్పాటు ఎవరు చేస్తారనే దానిపై ఓ పట్టాన కొలిక్కి రాకపోవడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు అజిత్ పవార్ సపోర్టుతో దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేయడం జరిగింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.