Mumbai, November 23: మహారాష్ట్ర(Maharashtra )లో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలో అధికార ఏర్పాటు మేమే చేస్తామని ఆదినుంచి చెబుతూ వస్తున్న సంజయ్ రౌత్ (Sanjay Raut) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులకు భయపడి అజిత్ పవార్ (Ajit Pawar feared going to jail) బీజేపీకి మద్దతు ఇచ్చాడన్నారు.
అతని వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు 10 మంది మాత్రమేనని వారిలో 5 మంది తిరిగి వచ్చారని ఆయన అన్నారు. త్వరలో అజిత్ పవార్ కూడా తన తప్పును తెలుసుకుని తిరిగివస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు అజిత్ పవార్(Ajit Pawar) తో ఉన్నారనే వార్తల నేపథ్యంలో శివసేన ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాత్రికి రాత్రే మారిన మహా రాజకీయాలు, మరోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్
మీడియాతో శివసేన ఎంపీ
Sanjay Raut, Shiv Sena: We are in touch with Dhananjay Munde and there is a possibility of even Ajit Pawar coming back. Ajit has been blackmailed, it will be exposed who is behind this, in Saamna newspaper soon. https://t.co/vESFauyjWR pic.twitter.com/DIomJ1niK2
— ANI (@ANI) November 23, 2019
ఇదిలా ఉంటే ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొందరు ఆయనకు షాక్ ఇచ్చారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తిరిగి ఎన్సీపీ అధినేత శరద్ పవార్(NCP president Sharad Pawar) వద్దకు చేరుకున్నారు. ఏదో పని ఉందంటూ అజిత్ పవార్ ఫోన్ చేశారని, దీంతో తాము రాజ్ భవన్ కు వెళ్లామని చెప్పారు. తమకు అంతకు మించి ఏమీ తెలియదని వివరించారు.
పార్టీతో పాటు, కుటుంబంలోనూ చీలిక వచ్చింది, శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలె ఆసక్తికర వ్యాఖ్యలు
రాజ్ భవన్ కు వెళ్లి మళ్లీ వచ్చేసిన ఎన్సీపీ ఎమ్మెల్యే రాజేంద్ర షింగానె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 'అజిత్ పవార్ నాకు ఫోన్ చేసి ఓ విషయంపై చర్చించాలని పిలిచారు. దాంతో రాజ్ భవన్ కు వెళ్లాను. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. దీంతో నేను వెంటనే తిరిగి శరద్ పవార్ వద్దకు వెళ్లిపోయాను. నేను శరద్ పవార్ తోనే ఆయనకు మద్దతుగా ఉంటానని చెప్పాను. అక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్న విషయం కూడా మాకు తెలియదు' అని వ్యాఖ్యానించారు.
సీఎం తంతు పూర్తయింది, బల నిరూపణే మిగిలి ఉంది, సీఎం ఫడ్నవిస్ బలనిరూపణలో నెగ్గుతారా
అజిత్ పవార్‌ది వెన్నుపోటు, మా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డాడు