'The Great CM Yogi': దటీజ్ యోగీ, నిరసనకారులు ఏడుస్తున్నారు, ప్రభుత్వ నిర్ణయంతో షాకవుతున్నారు, ట్వీట్ చేసిన యోగీ ప్రభుత్వ కార్యాలయం, మానవ హక్కుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వండి, యూపీ పోలీస్ చీఫ్‌కు నోటీసులు జారీ చేసిన మానవ హక్కుల కమిషన్
మొత్తం ఆరు లక్షల రూపాలయను నిరసనకారులు చెల్లించాలని వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గం ముందుకు వచ్చి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath)తీసుకుంటున్న చర్యలను యూపీ ప్రభుత్వ కార్యాలయం(Yogi Adityanath government) సమర్థించుకుంది.
Lucknow, December 28: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh)నిసరనలు కొద్దిగా తగ్గిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన సంగతి అందరికీ తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి(Citizenship Amendment) వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో (Anti-CAA Stir) ఆస్తి నష్టాన్ని పూడ్చేందుకు నిరసనకారులకు నోటీసులు జారీ చేసింది. మొత్తం ఆరు లక్షల రూపాలయను నిరసనకారులు చెల్లించాలని వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముస్లిం వర్గం ముందుకు వచ్చి ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది.
సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath)తీసుకుంటున్న చర్యలను యూపీ ప్రభుత్వ కార్యాలయం(Yogi Adityanath government) సమర్థించుకుంది. ఆందోళనల్లో హింసకు పాల్పడుతున్న వారిపై యోగి ఉక్కుపాదం మోపి.. వాళ్లను విస్తుపోయేలా చేస్తున్నారని ప్రశసించింది. ఈ మేరకు... ‘హాని తలపెట్టాలనుకున్న ప్రతీ ఒక్కరు షాక్ అవుతున్నారు. ('Shocked Every Protester')అల్లరి చేయాలనుకున్న వాళ్లంతా విస్తుపోతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు భయపడి వారు సైలెంట్ అయిపోయారు.
అల్లరిమూకల సమాచారం అందించేవారికి నగదు రివార్డ్
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారు నష్ట పరిహారం చెల్లించాలని సీఎం ఆదేశించారు. హింసకు పాల్పడ్డ ప్రతీ ఒక్క నిరసనకారుడు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరుగా పరిహారం చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో ఉన్నది యోగి ప్రభుత్వం. గ్రేట్ సీఎం యోగి’(#TheGreat_CMYogi) అని యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ట్వీట్ చేసింది.
Uttar Pradesh CMO Tweet:
పశ్చిమ యూపీలోని బులంద్‌షహర్‌లో గత శుక్రవారం చెలరేగిన అల్లర్లలో ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది. జరిగిన నష్టానికి చింతిస్తూ ముస్లిం సోదరులు పరిహారం చెల్లించారు. ఈ మేరకు రూ. 6.27 లక్షల చెక్కును ప్రభుత్వ అధికారులకు అందజేశారు. ఈ విషయం గురించి బులంద్‌షహర్ కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం నమాజ్ పూర్తైన తర్వాత కొంత మంది ముస్లిం వ్యక్తులు తనను కలిసి డీడీ ఇచ్చారని తెలిపారు.
UP CMO Tweet:
అదే విధంగా ప్రభుత్వ వాహనం ధ్వంసమైనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. హింసను వ్యతిరేకిస్తూ లేఖ కూడా అందించారని పేర్కొన్నారు. రికవరీకి వెళ్లకముందే స్వయంగా వారే పరిహారం చెల్లించడం గొప్ప విషయమని ప్రశంసించారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస కారణంగాగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. రూ .14.86 లక్షలు కట్టాలంటూ యూపీ సర్కారు 28 మందికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతియుత వాతావరణ నెలకొందని సీఎం కార్యాలయం తన ట్విటర్‌లో పేర్కొంది. కాగా సీఏఏకు వ్యతిరేకంగా యూపీలో జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా చెలరేగిన హింసలో ఇప్పటికే దాదాపు 21 మంది మరణించారు. ఎంతో మంది బుల్లెట్ గాయాలతో మరణించారని నిరసనకారులు ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం పోలీసులు కాల్పులు జరపలేదని పేర్కొంది.
నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేశారు. ఈ క్రమంలో దాదాపు 498 మందిని హింసకు పాల్పడినట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరిలో అత్యధికంగా మీరట్ నుంచి 148 మంది ఉన్నారని.. వీరందరినీ నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. యూపీ పోలీసు చీఫ్ వివరణ కోరుతూ.. జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.