Tiger Tests COVID-19 Positive: కరోనా మరో షాక్, పులికి కరోనా వైరస్ పాజిటివ్, న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలోని ఆడపులికి కోవిడ్ 19. ఖంగుతిన్న అధికారులు
పొడిదగ్గు రావడంతో అప్రమత్తమైన జూ అధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పాటుగా ట్విన్ స్టిసర్ అజుల్, రెండు అముర్ పులులతోపాటు మూడు ఆఫ్రికన్ సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి.
New York, April 6: ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న మహమ్మారి కరోనావైరస్ (Coronavirus) ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటిదాకా మనుషులకే వస్తుందనుకున్న కోవిడ్ 19 (COVID-19) జంతువులకు కూడా వస్తోంది. మొదటి సారిగా జంతువులకు సోకడం మరింత ఆందోళన రేపుతోంది.
చైనాలో మళ్లీ కరోనా కలకలం, కొత్తగా 39 కేసులు నమోదు
న్యూయార్క్ లోని బ్రాంక్స్ జూ లోని నదియా అనే ఆడపులి (4) ఈ వైరస్ (Tiger Tests COVID-19 Positive) బారిన పడింది. పొడిదగ్గు రావడంతో అప్రమత్తమైన జూ అధికారులు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పాటుగా ట్విన్ స్టిసర్ అజుల్, రెండు అముర్ పులులతోపాటు మూడు ఆఫ్రికన్ సింహాలు కూడా అనారోగ్యానికి గురయ్యాయి.
ఇది తనను షాక్ కు గురి చేసిందని, నమ్మలేక పోతున్నానని జూ డైరెక్టర్ జిమ్ బ్రెహనీ అన్నారు. నదియాకు మార్చి 27న కోవిడ్ -19 లక్షణాలు ప్రారంభమయ్యాయనీ, ప్రస్తుతం అన్నీ బాగానే ఉన్నాయని త్వరలోనే కోలుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.
దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు
కాగా రోజూ వీటి బాగోగులు చూసే ఉద్యోగి ద్వారా ఈ వైరస్ సోకినట్టుగా వైల్డ్ లైఫ్ సొసైటీ అధికారులు భావిస్తున్నారు. ఇన్ఫెక్షన్లకు వివిధ జాతులకు చెందిన జంతువులు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతాయని, కానీ ఈ క్రూర జంతువులకు ఈ మహమ్మారి ఎలా సోకిందో తెలియడంలేదని ఈ జూ నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే బెల్జియంలో ఒక పిల్లికి, హాంకాంగ్ లో రెండు శునకాలకు వాటి యజమానుల నుంచి కరోనా వైరస్ సోకిన విషయం సోకిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే న్యూయార్క్ లో అంతకంతకూ పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా మార్చి 16 నుంచి ఈ జూను మూసివేశారు.
మరోవైపు కరోనావైరస్ తో బాధపడుతున్న వ్యక్తులు జంతువులకు దూరంగా ఉండాలని అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్, ఫెడరల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధికారులు సిఫారసు చేశారు. జంతువులను ముట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పెంపుడు జంతువులను, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.