IPL Auction 2025 Live

Ramadan: రంజాన్..దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం, ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆచరించే పండుగ, రంజాన్‌ మాసం చరిత్ర, ఉపవాస దీక్షలపై ప్రత్యేక కథనం

ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది.

Ramzan Mubarak | Representational Image | (Photo Credits: Pixabay)

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ (Ramadan or Ramzan 2021) ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్‌ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన 'రోజా' ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. నెలవంక దర్శనంతో నెల రోజుల రంజాన్ పండుగ (Ramzan) వాతావరణం మొదలవుతుంది.

మహ్మద్‌ ప్రవక్త లా ఇల్లాహ ఇల్లాల్ల అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం.

ముస్లీంలకు అతి పవిత్ర మాసం రంజాన్, ఆ పండుగ గొప్పతనాన్ని తెలుసుకోండి, Quotes,Wishes, Sms, Images, Ramzan Mubarak 2020 గ్రీటింగ్స్ మీకోసం

రంజాన్ ఉపవాస దీక్షలు దాదాపు నెల రొజుల పాటు సాగుతాయి. ఈ నెల రోజుల పాటు ముస్లింలు చాలా భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను చేస్తారు. ఈ నెలలో తెల్లవారుజామున మరియు సూర్యాస్తమయం తరువాత వారు భోజనం చేస్తారు. సూర్యోదయానికి ముందు తీసుకున్న భోజనాన్ని సహర్ అని, సూర్యాస్తమయం తరువాత తీసుకున్న భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఈ నెలలోనే దేవుడు ఖురాన్ వచనాలను మొట్టమొదటిసారిగా ముహమ్మద్ ప్రవక్తకు "లైలతుల్‌ ఖద్ర్‌" (శక్తి యొక్క రాత్రి), దీవెనలు చేసినప్పుడు ఈ పవిత్రమైన రాత్రి గురించి వెల్లడించారని ముస్లింలు నమ్ముతారు. ఈ రోజున అల్లాహ్ యొక్క కరుణతో పాటు పాపములు క్షమించబడతాయని వారు విశ్వసిస్తారు.

మాతృ దినోత్సవం 2021, త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ, అమ్మ ప్రేమను చాటే కొటేషన్లు మీ కోసం

అరబిక్‌లో రంజాన్ అనే పదానికి భరించలేని వేడి, కాలడం అని అర్ధం. ఈ నెల రోజుల ఉపవాస దీక్షలో శరీరాన్ని సుష్కింపజేయడం ద్వారా ఆత్మప్రక్షాళనతో సర్వపాపాలు సమసిపోతాయని ముస్లింల విశ్వాసం. ఆ క్రమంలోనే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉండి మనోనిగ్రహం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఉపవాస దీక్షలతో ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్యపరాయణత్వం, సహనం, ధాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం తదితర ఉత్తమ గుణా లు ఆలవడుతాయని చెబుతారు.

ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో అద్భుతమైన మెసేజెస్ మీకోసం, మీ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది విషెస్ చెప్పేయండి

రంజాన్‌ ఉపవాస దీక్షగా వ్యవహరించే ‘రోజా’ను అరబిక్‌ భాషలో ‘సౌమ్‌’, ‘సియామ్‌’ అని అంటారు. సౌమ్‌ అంటే మా నుకొనుట, ఆపుట, ఆగుట, కట్టుబడి ఉండుట అనే అర్థాలు వస్తాయి. ఉపవాసిని ‘సాయమ్‌’ అని అంటారు. ఇస్లామియా పరిభాషలో ప్రభాత పూర్వ సమయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలు త్యజించడం ఈ ఉపవాస దీక్షకు పరమార్థంగా పేర్కొంటారు. ఈ ఉపవాసదీక్షలతో నిర్మలమైన, నిశ్చలమైన భక్తి భావం ఏర్పడడమే కాకుండా ఆకలి బాధతో అల్లాడే దీనజనుల కష్టాలను స్వయంగా ఉపవాస దీక్షల ద్వారా గుర్తించే అవకాశం లభిస్తుందని చెబుతారు.

రంజాన్‌ మాసంలోనే హజ్రత్‌ జిబ్రాయీల్‌ అలై సలాం యేటామహా ప్రవక్తకు దివ్య ఖుర్‌ ఆన్‌ సంపూర్ణంగా వినిపించే వారు. రంజాన్‌ ఆరంభంతోనే ‘తరావీహ్‌’ నమాజ్‌ ఆదేశించబడింది. వేయి రాత్రులకంటే పుణ్య ప్రదమైన రాత్రి ‘లైలతుల్‌ ఖద్ర్‌’ ఈ నెలలోనే ఉంది. ఆర్థిక ఆరాధనైన ‘జకాత్‌’ చెల్లించడం.. నిరుపేదల హక్కు అయిన ‘ఫిత్రా’ చెల్లించడం.. దైవ ప్రసన్నత చూరగొనే వనవ్రతం (ఏతెకాఫ్‌) పాటించడం వంటివి రంజాన్ లో ఆచరిస్తారు. మహాప్రవక్తకు రమజాన్‌ మాసం 21వ తేదీన ప్రవక్త పదవి లభించిందని చరిత్ర చెబుతోంది.

ఉగాదిని ముస్లింలు కూడా ఘనంగా జరుపుకుంటారని తెలుసా, సృష్టి ఆరంభమైన దినమే ఉగాది, జీవిత సత్యాన్ని తెలిపే యుగాది పచ్చడితో ఈ ఏడాది తెలుగు సంవత్సరానికి స్వాగతం పలుకుదామా..

క్యాలెండర్ డేట్.కామ్ ప్రకారం, ఈ సంవత్సరం రంజాన్ 2021 ఏప్రిల్ 12 సోమవారం సాయంత్రం నుండి ప్రారంభమవుతుంది మరియు 2021 మే 11 మంగళవారం ముగుస్తుంది. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన తరువాత, ఈద్ అల్-ఫితర్ జరుగుతుంది. షవ్వాల్' నెల మొదటి రోజున జరుపుకునే రంజాన్ పండుగను ' ఈదుల్‍ఫితర్ ' అని అంటారు. ఈ సంవత్సరం, ఈ పండుగ 2021, మే 13, గురువారంతో ముగుస్తుందని భావిస్తున్నారు. ఈ రోజున, ప్రజలు బహుమతులు మార్పిడి చేసుకుంటారు, వారి కుటుంబాలను కలుస్తారు. కలిసి భోజనం చేస్తారు.

భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి పడుకుంటారు.రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు.బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు.అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెలరోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.

మకర సంక్రాంతి అంటే అర్థం ఏమిటి? సూర్యుడికి సంక్రాంతికి సంబంధం ఏమిటి? మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటి?

రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.

జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రంజాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తూవుంది. దీనినే ' ఫిత్రాదానం' అని పిలుస్తారు. ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. దీనివలన సర్వపాపాలు హరించబడి, పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.

రంజాన్ మాసం ఐదు విధి విధానాల మీద ఉంటుంది.

1. కలిమ (అల్లాపై విశ్వాసం కలిగి ఉండటం)

2. నమాజ్ : ( ప్రతి రోజు అయిదు సార్లు నమాజ్ ఆచరించడం)

3. రోజ : (రంజాన్ మాసంలో ఉపవాసం పాటించడం

4. జకాత్ :(ఇస్లాం సూచించిన మేరకు ధాన దర్మాలు చేయడం)

5. హజ్: ( మక్కా సందర్శన..40 రోజుల దైవారాధన)