Food Adulteration: పాలల్లో సర్ఫ్‌.. పల్లిపట్టీల్లో గిన్నెలు కడిగే లిక్విడ్‌.. ఆహార కల్తీపై తమ అనుభవాలను పంచుకున్న నెటిజన్లు

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు.

Food Adulteration (Credits: X)

Newdelhi, June 21: కాదేదీ కల్తీకి అనర్హం (Food Adulteration) అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో (Social Media) పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు. రామ్‌ ప్రసాద్‌ అనే వ్యాపారవేత్త 2005లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఇలా చెప్పుకొన్నారు. తాను కొత్తగా సర్ఫ్‌ (Surf)ను తయారుచేసి మార్కెట్‌ లోకి విడుదల చేసినప్పుడు ఒక సేల్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ సర్ఫ్‌ లో పరిమళాన్ని తగ్గించాలని సూచించినట్టు  గుర్తుచేసుకున్నారు. ఎందుకని తాను అడగగా పాలల్లో కలిపేందుకు తక్కువ పరిమళం ఉండే సర్ఫ్‌ నే కొంటారని చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో దొరికే లస్సీ, పెరుగును తినడం మానేశానని చెప్పారు.

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిప‌ల్లి స‌త్యం భార్య ఆత్మ‌హ‌త్య‌.. అల్వాల్‌ లోని నివాసంలో ఉరి వేసుకున్న రూపాదేవి.. భార్య మృతదేహం చూసి స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే

కరకరలాడే పల్లిపట్టీ

ఈ పోస్ట్‌ కు స్పందనగా మరో వ్యక్తి తన స్నేహితుడి పల్లిపట్టీ కంపెనీలో అనుభవాన్ని చెప్పారు. ఒకరోజు పల్లిపట్టీలు తయారుచేయడానికి వచ్చిన కొత్త వ్యక్తి రోజుకంటే ఎక్కువ తయారుచేశాడని, పైగా కరకరలాడేలా చేశాడని తెలిపారు. ఇందులో మర్మమేంటో అతడిని అడగగా గిన్నెలు కడిగేందుకు వినియోగించే లిక్విడ్‌ ను పోసినట్టు చెప్పాడని గుర్తు చేసుకున్నారు. ఇలా నెటిజన్లు తమ జీవితంలో ఎదురైన ఆహార కల్తీ అనుభవాలను పంచుకొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ గా మారాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

Food Adulteration: పాలల్లో సర్ఫ్‌.. పల్లిపట్టీల్లో గిన్నెలు కడిగే లిక్విడ్‌.. ఆహార కల్తీపై తమ అనుభవాలను పంచుకున్న నెటిజన్లు

Adulterated Ice Creams: సమ్మర్ అని ఐస్‌క్రీమ్స్ తెగ లాగించేస్తున్నారా? పైన బ్రాండెడ్ స్టిక్కర్, లోపల నకిలీ ఐస్‌క్రీమ్, హైదరాబాద్‌లో నకిలీ ఐస్‌క్రీమ్ తయారీ ముఠా గుట్టురట్టు

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Advertisement

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Most Polluted Cities in India: ప్రపంచంలో టాప్‌-20 అత్యంత కాలుష్య నగరాలు, 13 నగరాలు భారతదేశంలోనే, మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Advertisement
Advertisement
Share Now
Advertisement