Newdelhi, June 21: కాదేదీ కల్తీకి అనర్హం (Food Adulteration) అన్నట్టు తయారవుతున్నది దేశంలో పెరుగుతున్న ఆహార కల్తీ వ్యవహారం. వెలుగులోకి వస్తున్న ఘటనలు కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో (Social Media) పలువురు నెటిజన్లు తమ అనుభవాలను పంచుకొంటున్నారు. రామ్ ప్రసాద్ అనే వ్యాపారవేత్త 2005లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఇలా చెప్పుకొన్నారు. తాను కొత్తగా సర్ఫ్ (Surf)ను తయారుచేసి మార్కెట్ లోకి విడుదల చేసినప్పుడు ఒక సేల్స్ ఎగ్జిక్యూటీవ్ సర్ఫ్ లో పరిమళాన్ని తగ్గించాలని సూచించినట్టు గుర్తుచేసుకున్నారు. ఎందుకని తాను అడగగా పాలల్లో కలిపేందుకు తక్కువ పరిమళం ఉండే సర్ఫ్ నే కొంటారని చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో దొరికే లస్సీ, పెరుగును తినడం మానేశానని చెప్పారు.
#MCTrends | Viral stories of food adulteration in #India reveal detergent in #milk and #dishwash liquid in candy.
ICMR warns that these can cause permanent organ damage.@AnkitaSengupta_ writes more on it ⏬https://t.co/1TtJ0wnfNB#FASSAI #FoodSafety #ICMR
— Moneycontrol (@moneycontrolcom) June 20, 2024
కరకరలాడే పల్లిపట్టీ
ఈ పోస్ట్ కు స్పందనగా మరో వ్యక్తి తన స్నేహితుడి పల్లిపట్టీ కంపెనీలో అనుభవాన్ని చెప్పారు. ఒకరోజు పల్లిపట్టీలు తయారుచేయడానికి వచ్చిన కొత్త వ్యక్తి రోజుకంటే ఎక్కువ తయారుచేశాడని, పైగా కరకరలాడేలా చేశాడని తెలిపారు. ఇందులో మర్మమేంటో అతడిని అడగగా గిన్నెలు కడిగేందుకు వినియోగించే లిక్విడ్ ను పోసినట్టు చెప్పాడని గుర్తు చేసుకున్నారు. ఇలా నెటిజన్లు తమ జీవితంలో ఎదురైన ఆహార కల్తీ అనుభవాలను పంచుకొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ గా మారాయి.