Milk from Tree (Credits: Twitter)

Bhopal, October 17: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వేప చెట్టు (Neem Tree) నుంచి పాల లాంటి తెల్లని ద్రవం (While Liquid) కారుతున్నది. దానిని చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సింగ్రౌలీ జిల్లా నిగాహిలో గత కొన్నేండ్లుగా ఉన్న ఓ వేప చెట్టు నుంచి పాలలాంటి పదార్థం కారుతోంది.

పశ్చిమ బెంగాల్‌లో రూ. 30 కోట్ల విలువైన రెండున్నర కేజీల పాము విషం పట్టివేత.. బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి.. 35 రోజుల్లో రెండోసారి పట్టుబడిన వైనం

ఉదయం నుంచి మొదలైన ఈ పాలధార అంతకంతకూ పెరుగుతుంది. అది అమ్మవారి మహిమేనని స్థానికులు భావిస్తున్నారు. పాలను ప్రసాదంగా భావించి.. ఆ ద్రవాన్ని పాత్రల్లో నింపుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. పైగా దానిని సేవిస్తే.. ఎటువంటి రోగాలు రావని కూడా అంటున్నారు. అయితే, చెట్టు నుంచి పాలు కారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.