Manipur Riots: మణిపూర్‌లో మళ్లీ హింస.. బిష్ణుపూర్‌లో ముగ్గురి మృతి.. తగలబడుతున్న ఇళ్లు.. మణిపూర్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా మృతి
బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు.
Newdelhi, Aug 5: హింసతో (violence) గత మూడు నెలలుగా తగలబడిపోతున్న మణిపూర్ (Manipur) ఇంకా కుదుటపడటం లేదు. బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగ (Meitei Community)కు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం గొడవలు
ఇదే జిల్లాలో రెండ్రోజుల క్రితం మెయిటీ తెగ ప్రజలు, సాయుధ బలగాల మధ్య జరిగిన గొడవల్లో 17 మంది గాయపడ్డారు. కాగా, మణిపూర్ లో దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు.