Hyderabad, Aug 4: బిస్కెట్లు (Biscuits) అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పార్లే- జీ (Parle-G Biscuits). దేశంలో పార్లేజీ బిస్కెట్లు రుచి చూడని వారు ఉండరు. ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల బిస్కెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ, చాలా మంది పార్లే-జి బిస్కెట్లను తినేందుకు ఇష్టపడుతున్నారు. 12 మంది కార్మికులతో ప్రారంభమైన ఈ బిస్కెట్ కంపెనీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్‌గా నిలిచింది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం 8000 కోట్ల విలువైన బిస్కెట్లను విక్రయిస్తుంది. ఇది ఒక రికార్డుగా (Record) చెప్పుకోవచ్చు. ఈ బిస్కెట్ ప్యాక్‌లో ఒక చిన్న అమ్మాయి అందమైన చిత్రం కనిపిస్తుంటుంది. ఈ అమ్మాయి ఎవరో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు.
Who is the iconic Parle Girl in wrapper of Parle G biscuit? Is it Sudha Murty's childhood picture?#ParleG #SudhaMurty https://t.co/s00yPNmX5N
— Zee News English (@ZeeNewsEnglish) July 31, 2023
Viral Video: ఈ స్నేహం ఎంతో మధురం.. పాము, ఆవు మధ్య మైత్రి.. వీడియో సూపర్
చిన్నారి బొమ్మ ఎవరిది?
పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్ పై ఉన్న చిన్నారి బొమ్మ ఎవరిది అన్నది దశాబ్దాలుగా ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇది ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫోటో అని చాలామంది భావించారు. కొందరు అది నీరూ దేశ్‌పాండే అని, మరికొందరు చిత్రంలో ఉన్న అమ్మాయి గుంజన్ దుండానియా అని ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ మిస్టరీ అమ్మాయి సీక్రెట్ రివీల్ అయింది. పార్లే-జి బిస్కెట్ బాక్స్ పై ఉన్న అమ్మాయి ఫోటో ఎవరిది కాదని పార్లే జి గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా తెలిపారు. ఇది కల్పిత చిత్రం మాత్రమేనని, ఎవరెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ మగన్ లాల్ దహియా 1960లో రూపొందించారని పేర్కొన్నారు.