Baby Girl Survives Miraculously: ముగ్గురు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి.. అనూహ్యంగా ప్రాణాలతో బయటపడిన ఆరు నెలల పసి పాప

ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది.

Representtaional Image (Photo Credits: Pixabay)

Newdelhi, Nov 5: ఒక తల్లి (Mother) ముగ్గురు పిల్లలతో (Children) కలిసి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనలో నీటిలో మునిగి తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోయారు. అదృష్టవశాత్తు ఆరు నెలల పసి పాప ప్రాణాలతో బయటపడింది. (Baby Girl Survives Miraculously) జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హైదర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీమండిహ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ శనివారం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఒక చెరువు వద్దకు చేరుకుంది. తొలుత నాలుగేళ్ల కుమార్తె, రెండున్నర ఏళ్ల కుమారుడ్ని నీటిలోకి తోసింది. అనంతరం ఆరు నెలల పసి పాపను చేతిలో పట్టుకుని ఆ మహిళ కూడా చెరువులోకి దూకింది. అయితే..

Mukesh Ambani: ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్.. నిందితులు తెలంగాణ, గుజరాత్ వాసులే

ఆమె చేతిలోని బిడ్డ జారి చెరువుగట్టుపై పడింది. దీంతో లక్కీగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. మరోవైపు చెరువులో పడి మునిగిన మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. కుటుంబంలో గొడవ వల్ల ఆ మహిళ తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

L&T Response on Medigadda Issue: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలకు లోబడి బ్యారేజీని నిర్మించాం.. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన.. ఏడో బ్లాక్‌ లో దెబ్బతిన్న భాగాన్ని పునరుద్ధరించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif