Newdelhi, Nov 5: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి (Mukesh Ambani) గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని అంబానీకి బెదిరింపు మెయిళ్లు (Threat Mails) పంపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపులపై ముఖేశ్ అంబానీ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ బెదిరింపు మెయిళ్ల వెనుక ఉన్నది తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి, మరో గుజరాత్ వ్యక్తి అని గుర్తించారు. వాళ్లని అరెస్ట్ చేశారు. తెలంగాణ విద్యార్థి పేరు వనపర్తి గణేశ్ కాగా గుజరాత్ వ్యక్తి పేరు షాబాద్ ఖాన్. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గణేశ్ ఆచూకీని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ముంబయికి తరలించారు. కోర్టులో హాజరుపర్చగా, నవంబరు 8 వరకు కస్టడీ విధించారు.
Mumbai Police arrests two individuals for sending ransom threat emails to Mukesh Ambani, demanding millions.https://t.co/z2z71vXClJ
— The Sentinel (@Sentinel_Assam) November 4, 2023
వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ సాయం
గణేశ్ బెదిరింపు మెయిళ్లు పంపడానికి వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) పరిజ్ఞానాన్ని వినియోగించాడని, మొదట ఆ మెయిళ్లు బెల్జియం నుంచి వచ్చినట్టుగా భావించామని, లోతుగా పరిశోధిస్తే ఆ మెయిళ్లు పంపింది తెలంగాణ విద్యార్థి అని గుర్తించామని పోలీసులు వివరించారు. తొలుత రూ.20 కోట్లు డిమాండ్ చేసిన గణేశ్ చివరికి రూ.400 కోట్లకు పెంచాడని తెలిపారు. అలాగే గుజరాత్ వ్యక్తి కూడా ఇందులో భాగమైనట్టు పేర్కొన్నారు.