UP Shocker: వివాహమైన గంటకే భార్యకు విడాకులు.. ఆపై తమ్ముడికిచ్చి వివాహం.. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘటన

అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన.

Credits: Facebook/File

Lucknow, Jan 6: ఉత్తరప్రదేశ్‌లోని (Uttarpradesh) సంభాల్ (Sambhal) జిల్లాలో జరిగిన ఓ పెళ్లి (Marriage) గంట వ్యవధిలోనే పెటాకులైంది. అస్మోలి పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన. తాను బతికి ఉండగానే రెండో పెళ్లి (Second Marriage) ఎలా చేసుకుంటావని భర్తతో (Husband) గొడవకు దిగింది కొత్త పెళ్లి కొడుకు మొదటి భార్య. గొడవ పెద్దది కావడంతో గ్రామస్థులు (Villagers) అక్కడికి చేరారు.

1 జనవరి 2024.. అయోధ్య రామాలయం ప్రారంభ తేదీ ఇదే.. చెప్పేసిన అమిత్ షా (వీడియోతో)

మరోవైపు భార్యకు నచ్చజెప్పేందుకు పెళ్లికొడుకుగా పీటలపై కూర్చున్న భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. మరోవైపు, గ్రామ పెద్దలు సమావేశమై ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఆలోచించారు. గంట క్రితం మనువాడిన రెండో భార్యకు విడాకులిచ్చి ఆమెను అతడి తమ్ముడికిచ్చి వివాహం చేస్తే ఏ గొడవా ఉండదని ప్రతిపాదించారు. ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య కూడా సైలెంట్ అయింది. దీంతో గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే వివాహం జరిపించాడు.

ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ

దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి నాలుగేళ్ల క్రితం మొదటి వివాహమైంది. అయితే, ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో సమస్య మొదలైంది. ఈ ఘటనపై ఇరువైపుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif