Credits: Twitter/ANI

Ayodhya, Jan 6: కోట్లాది హిందూ భక్తులు (Hindu Devotees) ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అయోధ్యలో (Ayodhya) నిర్మిస్తున్న రామాలయం (Ram Temple) ప్రారంభ తేదీని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Sha) తాజాగా వెల్లడించారు. నిన్న త్రిపురలోని (Tripura) సబ్రూంలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి రామాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు.

ఆర్టీసీ సంక్రాంతి ప్రత్యేక బస్సులు నేటి నుంచే.. 5 నుంచి 25 శాతం వరకు రాయితీ

‘‘రాహుల్.. సబ్రూం నుంచి చెబుతున్నా.. 1 జనవరి 2024 నాటికి రామాలయం సిద్ధమవుతుంది’’ అని నొక్కి చెప్పారు. పనిలో పనిగా త్రిపురలో ప్రధాన ప్రతిపక్షాలైన సీపీఎం, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు కలిసి అయోధ్యలో రామాలయం నిర్మించకుండా ఏళ్లపాటు ఆ సమస్యను కోర్టులో నానబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వృధా అయిన అక్షర్ పటేల్ కష్టం, రెండో టీ-20లో భారత్ ఓటమి, చివరి ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ, కట్టుదిట్టంగా శనక బౌలింగ్

కాగా, భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రామాలయ ట్రస్ట్ ప్రతినిధుల్లో పలువురు మద్దతు తెలిపిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా వ్యాఖ్యలను బట్టి వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రామాలయమే బీజేపీ ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఢిల్లీలో మరోసారి భూకంపం, నాలుగు రోజుల్లోనే రెండోసారి ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు