Snake Inside Garib Rath Express: ఏసీ ట్రైన్ కోచ్ లో పాము.. గరీబ్ రథ్ రైలులో ఘటన.. ప్రయాణికుల కేకలు (వీడియో)
ఇప్పుడు ఏకంగా ట్రైన్ లో ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్నాయి. గరీబ్ రథ్ రైలులో ఇటీవల ఓ పాము ప్రత్యక్షం అయ్యింది.
Newdelhi, Sep 23: ఇప్పటివరకూ జనావాసాల్లోకి వచ్చిన పాములు (Snakes).. ఇప్పుడు ఏకంగా ట్రైన్ లో ఎక్కి మరీ ప్రయాణం చేస్తున్నాయి. గరీబ్ రథ్ రైలులో ఇటీవల ఓ పాము ప్రత్యక్షం అయ్యింది. జబల్ పుర్ నుంచి ముంబై కి వెళ్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ (Garib Rath Express) లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు కాసర రైల్వే స్టేషన్ సమీపిస్తున్న వేళ ఏసీ కోచ్ జీ3లో ఈ పాము ప్రత్యక్షమైంది. బెర్త్ హ్యాండిల్ కు చుట్టుకొని హంగామా చేసింది.
టమాటను కొరికిన పాము.. ఈ వీడియో చూశాక.. ఇక నుంచి మీరు కూరగాయలు, పండ్లను పదేపదే కడుగుతారు (వీడియో)
ప్రయాణికుల హడల్
రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరుపులు, కేకలు పెట్టారు. భయంతో అందరూ కలిసి పక్క కోచ్ లోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఆ కోచ్ లోకి ప్రవేశించి పామును బయటకు పంపేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.