Chaos Outside Parliament: పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలతో గందరగోళం నెలకొంది. అంబేద్క‌ర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ.. నేడు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో కాంగ్రెస్ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్య‌తిరేకిస్తూ.. బీజేపీ ఎంపీలు కూడా ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ నేపథ్యంలోనే పార్ల‌మెంట్‌లోని మ‌క‌ర ద్వారం తోపులాట జ‌రిగింది. ఆ ఘ‌ర్ష‌ణ‌లో బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయ‌ప‌డ్డారు.

వీడియో ఇదిగో, పార్లమెంట్ వద్ద తోపులాట, బీజేపీ ఎంపీలు ప్ర‌తాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లకు గాయాలు, అంబేద్క‌ర్‌పై అమిత్ షా చేసిన వాఖ్యలపై క్షమాపణ చెప్పాలని ఇండియా కూటమి డిమాండ్

ఈ ఘటనపై సారంగి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మరో ఎంపీని తోసేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరమూ కిందపడడంతో తన తలకు గాయమైందని ఆరోపించారు. రాహుల్ గాంధీ తోసేయడం వల్లనే తాను కిందపడ్డానని సారంగి చెప్పారు.దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలు త‌న‌ను నెట్టివేశార‌ని, పార్ల‌మెంట్ లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తోయ‌డం వ‌ల్లే ఎంపీల‌కు గాయ‌మైన‌ట్లు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు.

Rahul Gandhi Reacts After Pratap Sarangi Blamed Him

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)