లోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్‌ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు.రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఈ బిల్లును విరుద్ధమని ప్రకటించారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని సూచించారు. బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చెప్పారని కేంద్ర హోం మంత్రి తెలిపారు. అయితే ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ.

జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Govt ready to send one nation one election Bill to JPC

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)