Chhattisgarh Horror: అబ్బాయిలతో ఫోన్ మాట్లొడద్దని చెప్పినందుకు.. అన్నను గొడ్డలితో నరికి చంపి నాటకమాడి చివరకు దొరికిపోయిన 14 ఏండ్ల బాలిక
ఛత్తీస్ గఢ్ లోని ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయిలతో ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని (17) నరికి చంపింది.
Newdelhi, May 5: ఛత్తీస్ గఢ్ లోని (Chhattisgarh) ఖైరాగఢ్ చుయిఖదాన్ గండై జిల్లాలో దారుణం జరిగింది. అబ్బాయిలతో ఫోన్ (Phone) ఎందుకు మాట్లాడుతున్నావని మందలించినందుకు ఓ 14 ఏండ్ల బాలిక తన అన్నని (17) నరికి చంపింది. అతడు నిద్రపోతున్న సమయంలో గొడ్డలి (Axe) తీసుకుని మెడపై నరికింది. తీవ్రంగా గాయపడటంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత తన అన్నను ఎవరో చంపినట్టు ఆమె నాటకం ఆడింది. తమ స్టైల్ లో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. అమ్లిదిహ్కల గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)