రాజమండ్రి నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. నేడు ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానం మధురపూడి విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ డైరెక్ట్ ఫ్లైట్‌లో రాజమండ్రి చేరుకున్నారు. విమానాశ్రయ సిబ్బంది వాటర్ కేనన్స్‌తో విమానానికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన నగరాలతో రాజమహేంద్రవరం అనుసంధానమైనట్టు చెప్పారు. ఇకపై మరిన్ని విమానాలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచి తిరుపతి, షిర్డీ, అయోధ్య తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని పురందేశ్వరి తెలిపారు. కాగా, ఢిల్లీ నుంచి ప్రతి రోజు రాజమండ్రికి నాన్‌స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఇండిగో తెలిపింది.
first non-stop flight Reached to Rajahmundry from Delhi
ఈ రోజు రాజమండ్రి నుండి ఢిల్లీ కి విమాన సర్వీసును ప్రారంభించడం ద్వారా దేశ రాజధానిని మన గోదావరి ప్రాంతానికి అనుసంధానం చేసాము. ఇండిగో ఎయిర్‌లైన్స్ యొక్క ఎయిర్‌బస్ A-320 ఇక పై జాతీయ రాజధానిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని మధ్య ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.
మన ప్రధానమంత్రి శ్రీ… pic.twitter.com/kY9x737Sry
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) December 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)