Droupadi Murmu. (Credits: ANI)

Hyderabad, DEC 11: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఈ నెల 21వ తేదీన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. వర్సిటీ (Telangana Women University) శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 17న రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు ఆమె తెలంగాణలో గడపనున్నారు. ఈ పర్యటన షెడ్యూల్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. రాష్ట్రపతి 17న ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు (AP) చేరుకుంటారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో జరిగే మొదటి కాన్వకేషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. 20న సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ను సందర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు, అలజడిగా మారిన సముద్రం, అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం 

గవర్నర్‌, సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 21వ తేదీన ఉదయం 11 గంటలకు కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చేరుకుని శ‌తాబ్ది వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు. కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.