Cyclone Fengal LIVE: Red Alert Issued for Tamil Nadu, Puducherry, and Andhra on Nov 29; Heavy rainfall expected (Photo-ANI)

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై (Chennai)కూడా తడిసి ముద్దయింది. భారీ వర్షం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

ఏపీలో అయిదు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింతగా బలపడనున్న అల్పపీడనం

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విళ్లుపురం, కళ్లకురిచ్చి, రామనాథపురం, అరియలూరు, కడలూరు, కరైక్కల్‌, తిరుచ్చి, నాగపట్టణం, కోయంబత్తూర్‌ సహా తదితర జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై, విల్లుపురం, తంజావూరు, మైలాదుతురై, పుదుక్కోట్టై‌, కడలూరు, దిండిగల్‌, రామనాథపురం, తిరువావూర్‌, రాణిపేట్‌, తిరువళ్లూరు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చారు.

Tamil Nadu Rain Videos

ఇక పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వేలూరు, పెరంబూర్‌, సేలం, నమక్కల్‌, శివగంగ, మదురై, దిండిగల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.