Allu arjun condolences on sandhya theatre Stampede incident

Hyderabad, DEC 11: హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును (High Court) ఆశ్రయించాడు. హైదరాబాద్‌ ఆర్జీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. డిసెంబర్‌ 4న పుష్ప 2 (Pushpa-2) ప్రీమియర్స్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు.

Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం  

అల్లు అర్జున్‌ థియేటర్‌కు వస్తున్న విషయాన్ని పోలీసులకు ముందుగా తెలియజేయడంలో అలసత్వం వహించడంతోపాటు భద్రత విషయంలోనూ నిర్లక్ష్యం వహించా​రంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బన్నీ.. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.