Hyd,Dec 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని గుర్తు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. సిద్దిపేటలో సర్వ శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మే శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు...కేసీఆర్‌ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగాడు రేవంత్ రెడ్డి...అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా రేవంత్ రెడ్డి, ఇంకా నెల కాలేదా? చెప్పాలన్నారు.
రేవంత్ ఆయన ఇంట్లో వాళ్ళు ఆ సంగతి గుర్తు చేయాలి...మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేసిండు అన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్ళను కూడా మోసం చేసిండు...బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు.
రైతులకు 15000 రైతు భరోసా అన్నాడు. 4000 ఆసరా పెన్షన్ అన్నాడు. 2500 మహిళలకు ఇస్తామన్నాడు.. అన్ని వర్గాలను మోసం మోసం చేసిండు..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ ఆక్ట్ ఎందుకు అమలు చేయడం లేదు.? అన్నారు. వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ 13 నాడు హామీ ఇచ్చావు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావు కదా...
నువ్వు చెప్పిన మాటలే ఎందుకు మర్చిపోయావు? అని ప్రశ్నించారు.
నువ్వు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేశావు...అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్తావు. నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? చెప్పాలన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.నీ ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. అని అంటే కేసు పెట్టావు....రుణమాఫీ ఎగబెట్టినవ్, రైతు భరోసా ఎగపెట్టినవ్, 4000 ఆసరా పెన్షన్లు ఎగబెట్టినవ్, మహిళలకు 2500 ఎగ్గొట్టినవ్ అన్నారు.
నువ్వు ఇచ్చిన అన్ని హామీలు ఎగ్గొట్టినవు కాబట్టి నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి...నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా .నువ్వు ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డినే అన్నారు.కనీసం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టే పరిస్థితి లేదు...గురుకుల పాఠశాలలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయారు అన్నారు. మూటలపై ఉన్న శ్రద్థ, మీరిచ్చిన మాటలపై లేదా? రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ
విద్యార్థులకు పెట్టే అన్నం మెస్ బిల్లులను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది...కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15% విద్యకు బడ్జెట్ పెడతామని 7% బడ్జెట్ కూడా పెట్టలేదు అన్నారు.విద్యా వాలంటీర్లను పూర్తిగా తొలగించారు.సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదు...ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు.
ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేద్దాం ఈ ముఖ్యమంత్రి మెడలు వంచుదాం...సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం...ఈనెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం అని హామీ ఇచ్చారు హరీశ్ రావు.